అలంకరించుకునేందుకు చేతులకు గాజులు, చెవులకు దిద్దులు, కాళ్లకు పట్టీలు ఎంత అవసరమో… అలాగే మెడకు కూడా అలంకరణ అవసరమే. ఓ అందమైన కంఠాభరణాన్ని ధరిస్తే ఎంత బావుంటుంది. ఈరోజుల్లో ఫ్యాషన్ కాస్త ఎక్కువైంది కాబట్టి.. దానికి తగ్గట్టుగానే ఎన్నో కంఠాభరణాలు దొరుకుతున్నాయి. కాలేజ్ అమ్మాయిలు ధరించేవి ఫ్యాన్సీ కంఠాభరణాల దగ్గర నుండి.. పెద్దవారికి సైతం ఎన్నోమోడల్స్ మీ ముందుకు వచ్చాయి. అయితే వీటి కోసం గంటలు గంటలు షాపింగ్‌లు చేయాల్సిన అవసరం లేదు. వేలకు వేలు డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. రంగురంగుల ముత్యాలతో సులభంగా మీరే తయారు చేసుకోవచ్చు. యూట్యూబ్‌లో మనం ఏదైనా నేర్చుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లోనే వుంటున్నాం. కాబట్టి ఈ తీరిక సమయంలో ఇలాంటి వెరైటీలను తయారు చేసుకోండి. మీకూ బోర్ కొట్టకుండా వుంటుంది. కొత్త విద్య నేర్చుకున్నామనే తృప్తి మిగులుతుంది.
ఈ ముత్యాల కంఠాభరణాలు చూశారా?
Related tags :