Movies

సితార్ మాయాజాలికుడు-పండిట్ రవిశంకర్

Remembering Pandit RaviShankar On His Birth Anniversary

ఏప్రిల్ 7, 1920లో గాజీపూర్ లో జన్మించారు. వీరు అల్లాయుద్దీన్ ఖాన్, హిందూస్థానీ సంగీతంలో మైహార్ ఘరానా స్థాపకుల యొక్క శిష్యుడు. సితార్ వాయిద్యం ద్వారా అనేక ప్రయోగాలు చేసి ప్రపంచ వ్యాప్తంగా అనేక సంగీత కచేరీలు, ప్రదర్శనలు ఇచ్చిన సంగీతజ్ఞుడు. ఆయన అమెరికాలోని శాండియాగో( 11 డిసెంబర్‌ 2012)లో తుదిశ్వాస విడిచారు.

రవిశంకర్‌ అసలు పేరు రబింద్రో శౌంకోర్‌ చౌదురి. తన బాల్యంలో నృత్యం నేర్చుకునేందుకు సోదరుడు ఉదయ్‌శంకర్‌తో కలిసి యూరప్‌ వెళ్లాడు. 1938లో నృత్యాన్ని పక్కనబెట్టి సితార్‌ నేర్చుకోవడానికి అల్లాద్దిన్‌ ఖాన్‌ అనే విద్వాంసుడి వద్ద చేరాడు. 1944లో చదువు అనంతరం మ్యూజిక్‌ కంపోజర్‌గా జీవితాన్ని ప్రారంభించి సత్యజిత్‌రే ‘అప్పు’ చిత్రానికి పనిచేశారు. 1949 నుంచి 1956 వరకు సంగీత దర్శకునిగా ఢిల్లీ ఆల్‌ ఇండియా రేడియోకు సేవలు అందించారు.

1956 నుంచి యూరప్‌, అమెరికాలో హిందుస్థాని క్లాసికల్‌ సంగీత ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించారు. బోధన, పదర్శనల ద్వారా హిందుస్థాని క్లాసికల్‌ సంగీతానికి ప్రపంచవ్యాప్త గుర్తింపు తీసుకువచ్చారు. తన కూతురు అనౌష్కతో కలిసి సంగీత ప్రదర్శనలు ఇచ్చారు. 2003లో అనౌష్క తన మ్యూజిక్‌ అల్బమ్‌ ద్వారా గ్రామీ అవార్డుకు నామినేట్‌ అయ్యారు.

1975లో యునెస్కో సంగీత పురస్కారం 1981లో పద్మవిభూషణ్‌ పురస్కారం 1988లో కాళిదాస్‌ సమ్మాన్‌ పురస్కారం 1992లో రామన్‌ మెగసేసే పురస్కారం ఫండిట్

1999లో అత్యున్నత పురస్కారం భారతరత్న

1986 నుంచి 1992 వరకూ రాజ్యసభలో నామినేటెడ్‌ సభ్యునిగా వ్యవహరించారు