వృద్ధులకు కరోనా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఇతరులతో పోలిస్తే, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ఇందుకోసం అవసరమైన జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు, కొన్ని ప్రత్యేక రక్షణ చర్యలూ పాటించాలి.
***యవలసినవి…
ఇంట్లోనే ఉండాలి. ఇంటికి వచ్చిన అతిథులను కలవకపోవడమే మేలు. ఒకవేళ కలవవలసివస్తే కనీసం రెండు మీటర్ల దూరం పాటించాలి.
తరచుగా చేతులతో పాటు, ముఖం కూడా సబ్బుతో కడుగుతూ ఉండాలి.
మోచేతిని అడ్డం పెట్టుకుని, లేదంటే టిష్యూ పేపర్/చేతి రుమాలులో మాత్రమే తుమ్మాలి. తుమ్మిన తర్వాత చేతి రుమాలును ఉతుక్కోవాలి. టిష్యూ పేపర్‌ను పారేయాలి. చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.ఇంట్లో వండిన వేడిగా ఉండే పోషకాహారం తీసుకోవాలి. తరచుగా నీళ్లు తాగుతూ ఉండాలి. వ్యాధినిరోధకశక్తి మెరుగుదల కోసం తాజా పళ్లరసాలు తాగాలి.తేలికపాటి వ్యాయామంతో పాటు ధ్యానం చేయాలి.వైద్యులు సూచించిన మందులు క్రమం తప్పకుండా వాడాలి.
దూరంగా ఉన్న బంధువులు/స్నేహితులతో ఫోన్/వీడియోకాల్ ద్వారా వారి క్షేమసమాచారాలు తెలుసుకుంటూ, అవసరమైన సహాయం పొందడం ఉత్తమం. చేయుంచుకోవలసిన సర్జరీలు (క్యాటరాక్ట్, మోకాలి మార్పిడిలాంటివి) ఉంటే, వాటిని ప్రస్తుతం వాయిదా వేసుకోవడం మేలు.తరచుగా తాకే వీలు ఉన్న ఉపరితలాలను (డోర్ నాబ్స్, గడియలు) క్రిమినాశని అయిన డెట్టాల్ లాంటి వాటితో శుభ్రం చేయాలి.దగ్గు, జ్వరం, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు మొదలైన వెంటనే ఆలస్యం చేయకుండా దగ్గర్లోని వైద్యులను సంప్రతించాలి.
***చేయకూడనివి…
ముఖం దాచుకోకుండా, అరచేతులు అడ్డు పెట్టుకుని తుమ్మకూడదు.
జ్వరం, దగ్గు ఉంటే ఇతరులకు సన్నిహితంగా వెళ్లకూడదు.
నాలుక, ముక్కు, కళ్లను చేతులతో తాకకూడదు. ఫ సొంత వైద్యం చేసుకోకూడదు.ఇతరులతో కరచాలనం చేయడం, గుండెలకు హత్తుకోవడం చేయకూడదు.రొటీన్ చెకప్ కోసం ఆస్పత్రులకు వెళ్లకూడదు. అవసరమైన సమయంలో ఫోన్ ద్వారా వైద్యులను సంప్రతించాలి.
వృద్ధుల్లారా…కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా?
Related tags :