తిరుమలలోని శ్రీవారి ఆలయంలోని మూడు రోజులుగా జరిగిన సాలకట్ల వసంతోత్సవాలు మంగళవారంతో వైభవంగా ముగిశాయి.తొలిరోజు, రెండవరోజు శ్రీ మలయప్ప స్వామి వారు తన ఉభయదేవేరులతో కలిసి వసంతోత్సవంలో సేవలు అందుకున్నారు.చివరిరోజున శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పతో బాటుగా శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఆంజనేయస్వామివారు, శ్రీరుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామివారు వసంతోత్సవ సేవలో పూజలందుకున్నారు.కాగా మధ్యాహ్నం 2 నుండి 4 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, కొబ్బరినీళ్ళు, పసుపు, చందనంతో అభిషేకం చేశారు
ముగిసిన శ్రీవారి వసంతోత్సవాలు
Related tags :