Food

బాదం గుండెకు మంచిది

Almonds Are Good For Your Heart-Telugu Food And Diet News

బాదం లాంటి నట్స్‌లో 15 రకాల పోషకాలైన విటమిన్ ఈ, మెగ్నీషియం, రిబోఫ్లోవిన్, జింక్ మొదలైనవి ఉంటాయి. వీటితో పాటుగా బాదాం ల లో పలు ఆరోగ్యకరమైన ప్రయోజనాలున్నాయి. రోజువారీ ఆరోగ్యం కోసం డైట్‌లో బాదములనుతీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.గుండె ఆరోగ్యం కోసం బాదములుఅంతర్జాతీయంగా మరియు భారతదేశంలో అత్యధిక సంఖ్యలో మరణాలకు అతిపెద్ద కారణంగా కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ (సీవీడీ) నిలుస్తున్నాయి. జర్నల్ న్యూట్రియంట్స్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం హెల్తీ డైట్‌లో భాగంగా బాదములను తినడం వల్ల డిస్లిపిడెమియా తగ్గుతుంది. “ఆరోగ్యవంతమైన గుండెకోసం, మనం ఏమి తింటున్నామో తెలుసుకోవడం ముఖ్యం. నేనెప్పుడూ కూడా గుండెకు అనుకూలమైన డైట్ ప్లాన్‌ను సూచిస్తుంటాను. దీనిలో బాదం, తాజా పళ్లు, మొలకలు, తృణధాన్యాలు, కూరగాయలు మొదలైనవి ఉంటాయ”ని న్యూట్రిషన్ అండ్ వెల్‌నెస్ కన్సల్టెంట్ షీలా కృష్ణస్వామి అన్నారు.చర్మ ఆరోగ్యం వృద్ధి చెందడంలో బాదములు మెరుగైన పాత్రను పోషిస్తున్నాయిమన చర్మ ఆరోగ్యంపై ఎన్నోఅంశాలు ప్రభావం చూపుతుంటాయి. ఆరోగ్యవంతమైన చర్మం కోసం పౌషకాలు సమృద్ధిగా కలిగిన ఆహారాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. చర్మం ప్రకాశవంతంగా మారడంలో బాదం తోడ్పడుతుంది. చర్మ ఆరోగ్యపు ఆవశ్యకతను గురించి సుప్రసిద్ధ బాలీవుడ్ నటి సోహా అలీఖాన్ మాట్లాడుతూ “ఓ నటిగా, క్రమం తప్పకుండా చర్మ ఆరోగ్యం మెరుగుపరుచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. దీనికోసం నేను ప్రతి రోజూ ఓ గుప్పెడు బాదములు తింటాను ” అని అన్నారు-బరువు నియంత్రణలో బాదములు సహాయపడతాయి-భారతదేశంతో పాటుగా అంతర్జాతీయంగా ఉబకాయం అనేది అతి తీవ్రమైన వైద్య స్థితిగా మారుతుంది. ఫిట్‌నెస్ నిపుణుడు, మోడల్ మిలింద్ సోమన్ మాట్లాడుతూ “నాకెప్పుడూ ఆరోగ్యం అనేది అత్యంత ప్రాధాన్యతాంశం. మన జీవితాలు ఎంత బిజీగా అయినా ఉండనీయండి, ఫిట్‌నెస్ తప్పనిసరి. ఆరోగ్యవంతమైన జీవనశైలి అనుసరించాలి . ఓ గుప్పెడు బాదములలో ఆకలి తీర్చే లక్షణాలు ఉన్నాయని నేను చదివాను. అది నా కడుపు నిండిందన్న భావన కలిగించడంతో పాటుగా భోజనాల నడుమ ఆకలిని కూడా దూరంగా ఉంచుతుంది” అని అన్నారు .