Editorials

ట్రంప్ గారూ…కాలిఫోర్నియా నుండైనా పాఠాలు నేర్చుకోండి సారూ!

How California survived the COVID19 pandemic with foresight

అమెరికా అంతా కొరోనా వ్యాప్తితో అతలాకుతలం అవుతుంటే కాలిఫోర్నియా మాత్రం తన ముందుచూపుతో ఈ వ్యాధి బారిన పడే వారి సంఖ్యను గణనీయంగా తగ్గించుకుంది. కరోనా విస్తరిస్తున్న తొలిరోజుల్లో(జనవరి ఫిబ్రవరిల్లో) కాలిఫోర్నియా గవర్నర్ గావిన్ న్యూసం 4కోట్ల కాలిఫోర్నియన్లు ఇళ్లకే పరిమితం కావల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. కేవలం ఈ ఒక్క ముందుజాగ్రత్త చర్య వలన కాలిఫోర్నియా అత్యధికంగా లాభపడింది. ఒకానొక దశలో ప్రస్తుతం అత్యధిక కేసులు కలిగిన న్యూయార్క్ కన్నా ఎక్కువ కేసులు కలిగిన కాలిఫోర్నియా, నేడు కేవలం 17వేల కేసులతో నాల్గవ స్థానంలో ఉంది. న్యూయార్క్ కాలిఫోర్నియా కన్నా 8రెట్ల అత్యధిక కేసులతో మొదటి స్థానంలో ఈసురోమంటోంది. ప్రజలను ఇళ్లకు పరిమితం చేయడం, యుద్ధప్రాతిపదికన మాస్క్‌లు పంపిణీ చేయడం, ప్రజలకు విస్తృత అవగాహన కల్పించడం వంటి చర్యల ద్వారా కాలిఫోర్నియా తనను తాను భద్రపరుచుకుంది. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దొరవారు మాత్రం కరోనా వ్యాప్తి చెందుతున్న ప్రారంభ కాలంలొ ఇదంతా హంబక్కు అని, ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసి భద్రతాపరమైన చర్యలను గాలికొదిలేశారు. నేడు ఆ దేశం ఆయన నిర్ణయాల వలన ప్రపంచానికి కరోనా రాజధానిగా వెలుగొందుతోంది.

Coronavirus Pandemic: What You Need to Know for Evening of April 7 ...