సుప్రీం కోర్టు కరోనా పరీక్షలు ఉచితంగా చేయాలన్న పిల్‌పై విచారణ చేసింది. గుర్తించిన ప్రభుత్వ, ప్రైవేట్ లేబొరేటరీల్లో జరుగుతున్న కోవిడ్ టెస్టుల్ని ఫ్రీగా నిర్వహించాలని అత్యున్నత ధర్మాసనం సూచించింది. అలాగే కోవిడ్ టెస్టుల కోసం ప్రభుత్వాల నుంచి రీయింబర్స్ మెంట్ పాలసీను కూడా అందుబాటులోకి తీసుకురావాలని తెలిపింది. కరోనా పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 118 ల్యాబ్ లు ఉన్నాయని సుప్రీంకోర్టుకు తెలిపారు సొలిసిటర్ జనరల్. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో 118 ల్యాబ్స్ సరిపోవన్న సొలిసిటర్ జనరల్.. 47 ప్రైవేట్ ల్యాబ్‌లను కరోనా పరీక్షలకు ఉపయోగిస్తున్నామని తెలిపారు. అయితే ప్రైవేట్ ల్యాబ్స్ లో అధిక ఫీజులు వసూలు చేయకుండా చూడాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.
కరోనా పరీక్షల కోసం ప్రైవేట్ క్లినిక్‌కు వెళ్తున్నారా?
Related tags :