నాట్స్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పేదలు, అనాథలకు కరోనా సమయంలో సాయపడింది. గుంటూరు జిల్లా నిడుబ్రోలులోని గోతాలస్వామి అనాధ ఆశ్రమానికి కావాల్సిన నిత్యావసరాలను ఉచితంగా నాట్స్ పంపిణి చేసింది. నాట్స్ అధ్యక్షుడు శ్రీనివాస్ మంచికలపూడి సౌజన్యంతో పొన్నూరు సీఐ ప్రేమయ్య చేతుల మీదుగా ఈ అనాధ ఆశ్రమానికి దాదాపుగా ఓ నెల రోజులకు సరిపడా బియ్యం, కందిపప్పు, నూనె, ఉల్లిపాయలు, అరటిపండ్లు, కూరగాయలు అందించారు. నాట్స్ అధ్యక్షులు శ్రీనివాస్ మంచికలపూడి సన్నిహితులు కామేపల్లి వెంకటేశ్వరరావు, దొంతినేని సాయికృష్ణ, బొద్దూలూరి కిశోర్ బాబు, అడ్వకేట్ బాజీ తదితరులు అనాధ ఆశ్రమానికి వెళ్లి వీటీని అందజేశారు.
నిడుబ్రోలులో నాట్స్ వితరణ
Related tags :