Politics

మీ సలహాలు మీ దగ్గరే ఉంచుకోండి

RK Roja Counters TDP Suggestions To YS Jagan

ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడిపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్‌కే రోజా విమర్శలు గుప్పించారు. బుధవారం చిత్తూరులో ఆమె మాట్లాడుతూ… చంద్రబాబు నాయుడు తనను గెలిపించిన ప్రజలను గాలికి వదిలేసి ఆంధ్ర నుంచి అమెరికా వరకు సలహాలివ్వడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయుడి సలహాలు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు అవసరమేమో గాని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి అవసరం లేదని రోజా పేర్కొన్నారు. ఏ రాష్ట్రంలో చేయని పనులు జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తూ దేశానికే ఆదర్శంగా పరిపాలన కొనసాగిస్తున్నారని రోజా కొనియాడారు. జగన్‌ ప్రవేశపెట్టిన వాలంటరీ వ్యవస్థ అన్ని విధాలా అభినందనీయమని ప్రశంసించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన వారిని, ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిని గుర్తించడంలో వాలంటరీ వ్యవస్థ ఆదర్శనీయంగా పనిచేస్తోందని రోజా కితాబిచ్చారు. రాష్ట్రంలో లో ఏడు వైరస్ ల్యాబ్స్ పెట్టి కరోనా వ్యాధిని కట్టడి చేస్తున్నారని తెలిపారు. ఈ వ్యాధిని ఆరోగ్యశ్రీ కింద చేరుస్తూ 12 వేల రూపాయల నుంచి 2 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరించే విధంగా నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా రోజా ధన్యవాదాలు తెలిపారు.

YSRCP MLA RK Roja Distributes Sanitizers & Face Masks To Doctors ...