లాక్‌డౌన్ కారణంగా ఏర్పడిన ఈ విరామంలో జీవితంలోని కొత్త కోణాల్ని దర్శించిన అనుభూతి కలుగుతున్నదని అంటోంది అనుష్క. ఎలాంటి తారతమ్యాలు లేకుండా మానవత్వంతో కరోనా విపత్తు నుంచి ధరిత్రిని రక్షించుకునే మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగమవ్వాలని చెప్పింది. అనుష్క మాట్లాడుతూ ‘ఈ విపత్తు వల్ల అసాధ్యాలన్నీ సుసాధ్యమవుతున్నాయి. సాధ్యమైనవన్నీ అదృశ్యమైపోతున్న భావన కలుగుతున్నది. తెలిసినవన్నీ తెలియనట్లుగానే కనిపిస్తున్నాయి. అందరం విభజింపబడినట్లుగా, ఒంటరి వాళ్లమైనట్లుగా ఉంది. కానీ ఐక్యంగా నిలవడం స్ఫూర్తినిస్తున్నది. సరిహద్దులు, కాలాల పరంగా వేరైనా కలిసి కట్టుగా అందరి క్షేమం కోసం ప్రేమ పూర్వక హృదయంతో ప్రార్థిద్దాం. మన ప్రాణాల్ని కాపాడటానికి పనిచేస్తున్న వారికి, మనల్ని అనుక్షణం జాగ్రత్తగా కాపాడుతున్న వారికి, మనకు సహాయం చేస్తున్న వారికి కృతజ్ఞతలు చెప్పడానికి మాటలు సరిపోవు. ప్రతి వ్యక్తి అందరి క్షేమం కోసం పాటుపడే సందర్భమిది’ అని తెలిపింది.
లాక్‌డౌన్ ఓ మధురానుభూతి
Related tags :