NRI-NRT

భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా తెలంగాణా సంఘం సాయం

Australia Telangana Association Helps Local Indian Students During Corona Times

ఆస్ట్రేలియాలో నివసించే భారతీయ విద్యార్థులకు అండగా నిలిచిన ఆస్ట్రేలియా తెలంగాణ అసోసియేషన్. కరోనా వైరస్ విజృంభించడం కారణంగా ఆస్ట్రేలయాలో లాక్‌డౌన్ పెట్టారు. దీనితో అక్కడి స్థానికంగా ఉన్న భారతీయ విద్యార్థులు నిత్యావసర సరుకులకై ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. వీరి సమస్యపై ఆస్ట్రేలియా తెలంగాణా అసోసియేషన్ అధ్యక్షుడు అనిల్ బైరెడ్డి నేతృత్వంలో సంస్థ కార్యవర్గ సభ్యులు విద్యార్థులకు సరుకులను అందజేసి వారిని అన్నిరకాలుగా ఆదుకుంటామని హామీనిచ్చారు. కార్యక్రమంలొ సంస్థ సభ్యులు ఫణికుమార్, కిరణ్, వంశీకొట్టల,కృష్ణ వడియల, రవి దామర, రఘు, పుల్లారెడ్డి, ప్రవీణ్ దేశం, అమర్, రాజవర్ధన్ రెడ్డి, మహేష్, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.