ఉష్టోగ్రత ఎక్కువున్నా, తక్కువగా ఉన్నా జలుబు, దగ్గు వంటి సమస్యలు ఎదురవ్వడం సహజం. అలా అని వదిలేయలేం కదా. శరీరానికి వేడి కలిగించే పదార్థాలు తిన్నా దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవిలో ఎక్కువగా వేడి చేసేవారు ఉదయాన్నే పరగడుపున అంజీర్ పండ్లు తింటే శరీరానికి చలువ చేస్తుంది. ఫట్‌మని వేడి తగ్గిపోతుంది. చాలామంది హైబీపీలతో బాధపడుతూ ఉంటారు. వీరికి ఎవరు ఏ విషయం చెప్పాలన్నా సంకోచిస్తూ ఉంటారు. అందుకే వీరు తప్పనిసరిగా అంజీర్ పండ్లు తినాలి. అందులో ఉండే పొటాషియం హైబీపీని తగ్గిస్తుంది. అంతేకాదు అంజీరా గుండెకి సంబంధించిన సమస్యలను రాకుండా చేస్తుంది. ఈ పండ్లలో ఐరన్ రక్తహీనత సమస్యను పోగొడుతుంది. ఇది డయాబెటిస్ లెవల్స్‌ను అదుపులో ఉంచుతుంది. దీనిలో ఉన్నపీచుపదార్థం శరీరంలో ఇప్పటివరకు పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ఎముకలు స్ట్రాంగ్‌గా తయారవుతాయి. ఇప్పడు అందరినీ పట్టిపీడిస్తున్న క్యాన్సర్ మయమ్మారిని రాకుండా చూసుకుంటుంది. ఇవన్నీ కంట్రోల్లో ఉంటే నిద్ర చక్కగా పడుతుందని పరిశోధనలో వెల్లడైంది. మలబద్ధకానికి పెట్టింది పేరు. అజీర్తిని తొలగిస్తుంది. కడుపు నొప్పి, జ్వరం, చెవినొప్పి, లైంగిక వ్యాధులను తగ్గించడంలో అంజీర్ కీలకపాత్ర పోషిస్తుంది. బుద్ధిమాంద్యత లక్షణాలు తగ్గి తెలివితేటలు పెరుగుతాయి. మొలలు ఉన్నవాళ్లు రోజుకి రెండుపళ్లు నానబెట్టి తీసుకుంటే తగ్గిపోతాయి. అంతేకాకుండా చర్మాన్ని కాంతివంతం చేయడంలో ప్రాధాన పాత్ర పోషిస్తుంది.
వేసవిలో చలువ చేసే అంజీర్
Related tags :