* కరోనా వైరస్ కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌తో రాష్ట్రంలో నేరాలు తగ్గుముఖం పట్టాయి. సాధారణ రోజులతో పోలిస్తే ప్రస్తుతం నేరాలు 23.63 శాతం తగ్గినట్టు స్పష్టమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా ఇండ్లకే పరిమితమవడం, గ్రామం నుంచి నగరం వరకు అడుగడుగునా పోలీసుల గస్తీ ముమ్మరం కావడంతో నేరస్థుల్లోనూ భయం మొదలైంది. ఫలితంగా హత్యలు, దోపిడీలు, దొంగతనాల్లాంటి అనేక నేరాలు గణనీయంగా తగ్గినట్టు పోలీస్‌శాఖ విడుదలచేసిన తాజా గణాంకాలు స్పష్టంచేస్తున్నాయి. లాక్‌డౌన్‌కు ముందు 21 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా అన్నిరకాల నేరాలకు సంబంధించి మొత్తం 12,403 కేసులు నమోదవగా.. లాక్‌డౌన్ విధించిన మార్చి 22 నుంచి సోమవారం వరకు 6,766 కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ కేసుల సంఖ్య హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 1,618 నుంచి 853కు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,882 నుంచి 610కి, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 1,552 నుంచి 777కు తగ్గినట్టు తెలిపారు. లాక్‌డౌన్‌కు ముందు 21 రోజుల్లో 15 దోపిడీలు జరుగగా.. లాక్‌డౌన్ సమయంలో వీటిసంఖ్య నాలుగుకు తగ్గింది. అలాగే దొంగతనాల సంఖ్య 1,108 నుంచి 262కు, హత్యల సంఖ్య 32 నుంచి 10కి, కిడ్నాప్‌లు 210 నుంచి 29కి, హత్యాప్రయత్నాలు 88 నుంచి 24కు, మిస్సింగ్ కేసులు 1,237 నుంచి 414కు తగ్గినట్టు వివరించారు. లాక్‌డౌన్ సమయంలో వాహనరాకపోకలు గణనీయంగా తగ్గినప్పటికీ రోడ్డు ప్రమాదాలు పెరుగడం ఆందోళన కలిగిస్తున్నది. ఏదో అత్యవసర పనులంటూ రోడ్లమీదకు వస్తున్న యువత.. ఖాళీగా ఉన్న రోడ్లపై మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకొంటున్నారు. లాక్‌డౌన్ విధించిన మార్చి 22 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిగిన 199 రోడ్డు ప్రమాదాల్లో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 128 మంది గాయపడ్డారు.
* తెలంగాణలో ఇవాళ కొత్తగా 18 కరోనా పాజిటివ్ కేసులు నమోదు..తెలంగాణ లో ఇప్పటి వరకు 471 కరోనా పాజిటివ్ కేసులు ..ఇవాళ మరొకరు మృతిఇప్పటి వరకు మొత్తం 12 మంది మృతి చెందారు..పాజిటివ్ కేసుల నుంచి 45 మందికోలుకుని..డిశ్చార్జి అయ్యారుప్రస్తుతం రాష్ట్రంలో 414 యాక్టీవ్ పాజిటివ్ కేసులు ఉన్నాయి
* కర్నూలు జిల్లాలో విచిత్రమైన పరిస్థితి నెలకింది.కరోనా చికిత్సలకు ప్రభుత్వ వైద్యులు దూరమయ్యారు.ఎస్మా కింద అనేకమంది డాక్టర్లకు నోటీసులు జారీ చేశారు.దీంతో మొత్తం భారం ప్రైవేటు వైద్యులపైనే పడింది.పీపీఈ, మాస్క్‌లు లేకుండా వైద్యము చేయలేమని ప్రైవేటు డాక్టర్లు అంటున్నారు.తొలి ప్రాధాన్యం జీజీహెచ్‌కే ఇచ్చి ప్రభుత్వ సిబ్బందికీ విధులు అప్పగించాలని వారు పట్టుబడుతున్నారు.అప్పుడే తాము సేవలు అందిస్తాం కాదంటే అరెస్టులకూ సిద్ధమేనని చెబుతున్నారు.
* భారత్ లో ఆరు వేలకు చేరువలో కరోనా పాజిటివ్ కేసులురాష్ట్రాల అధికారిక లెక్కల ప్రకారం 5916 కి చేరిన కరోనా కేసులు,180 మంది మృతిదేశవ్యాప్తంగా 5171 యక్టీవ్ కేసులు,కోలుకున్న 565 మంది బాధితులుఅత్యధికంగా మహారాష్ట్రలో1135 కేసులు,72 మంది మృతితమిళనాడు లో 738 కేసులు,8 మంది మృతిఢిల్లీలో 669 కేసులు,9 మంది మృతితెలంగాణలో 453 కేసులు,11 మంది మృతిరాజస్థాన్ లో 383 కేసులు,ముగ్గురు మృతిఉత్తరప్రదేశ్ లో 361 కేసులు,నలుగురు మృతిఆంధ్రప్రదేశ్ లో 348 కేసులు ,ముగ్గురు మృతికేరళలో 345 కేసులు,ఇద్దరు మృతిమధ్యప్రదేశ్ లో 341 కేసులు,24మంది మృతిగుజరాత్ లో 186 కేసులు,16 మంది మృతి
* హోమ్ క్వారంటైన్‌లో ఉండాల్సినవారికి చిన్న ఇళ్లు ఉంటే మేమే క్వారంటైన్ అవకాశం కల్పిస్తామని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. వెయ్యి వెంటిలేటర్ల కోసం ఆర్డర్ చేశామని ఈటల చెప్పారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తి గురించి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో 101 హాట్ స్పాట్‌లను గుర్తించాం. ఆ ప్రాంతం వాళ్లకు అన్నిరకాల సేవలు అందేలా చూస్తాం. దగ్గు, జలుబు వంటి లక్షణాలు ఉన్నవారు వెంటనే ఆస్పత్రులను సందర్శించాలి. తలసీమియా రోగులకు రక్తం దొరకడం లేదు. దాతలు ముందుకు వచ్చి రక్త దానం చేయాలి. రాష్ట్రంలో 10 వేలకు పైగా డయాలసిస్ రోగులున్నారు. వీరందరికీ పూర్తి సహకారం అందిస్తాం. క్యాన్సర్ రోగులకు చికిత్స కావాల్సినవారు తెలియజేస్తే… రవాణా సౌకర్యం కల్పిస్తాం’’ అని ఈటల తెలిపారు.
* కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశంలోని పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ కల్పించాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దిల్లీ సఫాయి కర్మచారీస్ కమిషన్ మాజీ ఛైర్మన్ హర్మన్ సింగ్ ఈ పిటిషన్ వేశారు. 24 గంటల్లో పారిశుద్ధ్య కార్మికులకు రక్షణ సామగ్రి అందించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలివ్వాలని పిటిషనర్ న్యాయస్థానాన్ని కోరారు. అలాగే 48 గంటల్లో కార్మికులతోసహా కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు నిర్వహించాలన్నారు. పారిశుద్ధ్య కార్మికులు విధులు నిర్వహించే సమయంలో పీపీఈ కిట్లు వాడేలా డబ్ల్యూహెచ్వో మార్గదర్శకాలు ఇచ్చిందని హర్మన్ సింగ్ పిటిషన్‌లో ప్రస్తావించారు.