అన్నింటికీ ఓకే అంటే ఎక్కువ డబ్బులు ఇస్తానంటూ ఓ వ్యక్తి తనకి ఫోన్ చేశారని నటి మాన్వి గగ్రూ ఆరోపణలు చేశారు. పలు వెబ్‌సిరీస్‌ల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి గతేడాదిలో ప్రసారమైన ‘ఫోర్ మోర్ షార్ట్స్ ప్లీజ్!’ అనే టీవీ షోతో ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇటీవల మాన్విని ఓ బాలీవుడ్ పత్రికవారు సంప్రదించగా… ఆమె తన జీవితానికి సంబంధించిన ఓ విషయాన్ని బయటపెట్టారు. ఓ అనుచిత వ్యక్తి తనతో ఫోన్లో ఏవిధంగా అసభ్యకరంగా ప్రవర్తించాడో తెలిపారు. ‘ఒక సంవత్సరం క్రితం ఓ కొత్త ఫోన్ నంబర్ నుంచి నాకు వరుసగా కాల్స్ వచ్చాయి. ఒకరోజు నేను ఆ కాల్స్‌కు స్పందించగా.. ‘మేము ఒక వెబ్ సిరీస్ చేయాలనుకుంటున్నాం. అందులో మీకు మంచి పాత్ర ఇవ్వాలనుకుంటున్నాం.’ అని చెప్పారు. అంతేకాకుండా వాళ్లు నాకు బడ్జెట్ గురించి కూడా చెప్పారు. నేను వెంటనే.. ‘అది చాలా తక్కువ బడ్జెట్. కానీ మీరు నాతో ఎందుకు బడ్జెట్ గురించి చర్చిస్తున్నారు. ముందు నాకు కథ చెప్పండి. నేను ఓకే అనుకుంటే నటిస్తాను.’ అని గట్టిగా సమాధానం చెప్పాను. దీంతో అవతలి వ్యక్తి.. ‘మేము ముందు బడ్జెట్ చెప్పి.. మా బడ్జెట్‌కు ఓకే అంటేనే వెబ్ సిరీస్‌లలో నటించే అవకాశం ఇవ్వాలనుకుంటున్నాం.’ అని చెప్పాడు. నేను వెంటనే.. ‘బడ్జెట్ చాలా తక్కువ. అది కుదరదు.’ అని అన్నాను. దానికి అతను ముందు చెప్పిన బడ్జెట్ కంటే మూడు రెట్లు ఎక్కువగా చెప్పి.. ‘మీరు కనుక అన్నింటికీ ఓకే అంటే మీకింత డబ్బులు ఇస్తాను. కానీ మీరు అన్నింటికీ రాజీపడాలి.’ అని ద్వంద్వార్థాలు వచ్చేలా మాట్లాడాడు.’ అని మాన్వి తెలిపారు.
ఎంతైనా ఇస్తానన్నాడు
Related tags :