?సెల్‌ఫోన్ శుభ్రత మరవొద్దు..!
♦️కరోనా కట్టడికి ప్రభుత్వాలు లాక్డౌన్ ప్రకటించడంతో ఇళ్లలో చాలామంది సెల్ఫోన్లకే పరిమితమయ్యారు. యువత సామాజిక మాధ్యమాల్లో బిజీగా ఉంటుండగా.. చిన్నారులు గంటల తరబడి ఆటలాడేస్తున్నారు. కానీ.. కరోనా వ్యాప్తికి సెల్‌ఫ్లోన్లు కూడా కారణమవుతాయని వైద్యులు చెబుతున్నారు. కొవిడ్-19 మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో నిత్య జీవితంలో భాగమైన సెల్‌ఫోన్‌ను సైతం శుభ్రంగానే ఉంచుకోవాలంటున్నారు. ముఖ్యంగా సెల్‌ఫోన్ వెలుపలి భాగం అనేక సూక్ష్మక్రీములతో నిండి ఉంటుందని చెబుతున్నారు వైద్యులు. నిజానికి మన చేతులకంటే సెల్‌ఫోనే ముఖాన్ని ఎక్కువగా తాకుతుంటుంది. చేతులు ఎన్నిసార్లు శుభ్రం చేసుకున్నా మొబైల్ శుభ్రంగా లేకపోతే తిరిగి సూక్ష్మక్రీములు మనల్ని చేరుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ మాత్రం జబ్బులకు ఆస్కారం ఇవ్వకూడదు. .
➡️వీటిని వాడొచ్చు..
♦️తరచూ చేతులతో పాటు ఐసోఫ్రోఫైల్ ఆల్కహాల్‌తో ఫోన్‌ను శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల క్రీములు చనిపోతాయి.
♦️సబ్బు నీరు, కళ్లజోడు శుభ్రం చేసుకునే మెత్తని వస్ర్తాన్ని కూడా దీనికి వాడొచ్చని ఆపిల్ కంపెనీ సూచిస్తోంది.
♦️ ఐఫోన్లో ఇటీవల వచ్చిన వెర్షన్లు చాలా వరకు వాటర్‌ప్రూఫ్ టెక్నాలజీతో ఉన్నవే. ఇతర కంపెనీల ఫోన్లు పూర్తిగా వాటర్‌ప్రూఫ్ కావు.. అందువల్ల ఫోన్ భాగాలను జాగ్రత్తగా శుభ్రపర్చుకోవాలి.
♦️దీనికోసం ఎలాంటి రసాయన ద్రావణాలు వాడవద్దని ఆపిల్, సామ్సంగ్ కంపెనీలు సూచిస్తున్నాయి. రసాయనాల వల్ల స్రీన్ కోటింగ్ దెబ్బతిని టచ్ ఫ్యూచర్ పాడయ్యే అవకాశముంటుంది.
♦️ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉన్న ఫోన్లు శుభ్రం చేయడానికి మైక్రోఫైబర్ వస్ర్తాన్ని వాడొచ్చు.
♦️ ఎక్కువగా కాల్స్ మాట్లాడే వారు ఇయర్ ఫోన్స్, బ్లూటూత్ వాడటం మంచింది. దీనివల్ల ఫోన్‌పై ఉన్న సూక్ష్మక్రీములు ముఖంపైకి చేరే అవకాశం తక్కువ. అయితే ఇయర్‌ఫోన్స్, బ్లూటూత్ పరికరాలను సైతం శుభ్రంగానే ఉంచుకోవాలి.