ప్రతినెలా మొదటి శుక్రవారం ఆన్లైన్ కోటాలో విడుదల చేసే శ్రీవారి సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శన కోటా టికెట్లను తితిదే వాయిదా వేసింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో జూన్ నెలకు సంబంధించిన టికెట్లను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. ముందుగానే నగదు చెల్లించి మే 31వ తేదీ వరకు శ్రీవారి సేవలు, ఆన్లైన్ డిప్, ప్రత్యేక ప్రవేశదర్శనాలు, గదులను పొందిన భక్తులు వాటిని రద్దు చేసుకునేందుకు తితిదే అవకాశం కల్పించింది. భక్తులు టికెట్లు, గదులను రద్దు చేసుకుంటే నగదును తిరిగి చెల్లించనుంది.
శ్రీవారి సేవా టికెట్ల విడుదల వాయిదా
Related tags :