DailyDose

ఇండియాలో కరోనాకు 215మంది బలి-TNI కథనాలు

215People Died In India So Far Due To Corona

* అనంతపురం జిల్లా…. ఈ రోజు రెండు కరోనా పాజిటివ్ కేసులు నమోదు…….అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఈ రోజు రెండు కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవ్వడం జరిగింది. కొత్తచెరువు కు చెందిన 56 ఏళ్ల ఒక వ్యక్తికి కొత్తచెరువు కు చెందిన 56 ఏళ్ల ఒక వ్యక్తికి కరోనా నిర్ధారణ కాగా, కరోనా వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించిన వైద్య బృందం లోని ఒక నర్సు కు కూడా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తెలియవచ్చింది. కాగా కొత్తచెరువులో కరోనా నిర్ధారణ అయిన వ్యక్తికి చికిత్స అందించిన ఒక ఆర్ఎంపీ డాక్టర్ మరియు నర్సును quarentain కు తరలించినట్లు తెలియవచ్చింది.

* ప్రపంచ దేశాల్లో కరోనా విలయ తాండవం చేస్తుంది. ఇప్పటి వరకు ఈ వైరస్ కు వ్యాక్సిన్ కనుక్కోకపోవడంతో అనేక ఇతర మందులను వాడి వ్యాధిని తగ్గిస్తున్నారు. అయితే కరోనా ను తగ్గించడం లో హైడ్రోక్సీక్లోరోక్విన్ ఎక్కువ ప్రభావం చూపడంతో అగ్ర రాజ్యం అమెరికా సైతం భారత్ ను ఆ ఔషధం సరఫరా చేయాలనీ కోరింది. ఫ్రాన్స్ లోని ఓ ఆసుపత్రిలో వైద్యులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై కరోనా చికిత్సలో హైడ్రాక్సీక్లోరోక్విన్ వాడకూడదని నైస్ నగరంలోని యూనివర్సిటీ ఆసుపత్రి వైద్యులు తీర్మానించారు.ఈ ఔషధాన్ని మలేరియా ను తగ్గించడానికి వాడతారని దీనిని కరోనా తగ్గించడానికి వాడితే దుష్ప్రభావాలు ఏర్పడే అవకాశం ఉందని ఈ నిర్ణయం తీసుకున్నారు.

Twins born during coronavirus outbreak in India named 'Corona' and ...

* కరోనా నిరోధక చర్యల కోసం రూ.3 కోట్లు విరాళంగా ఇస్తున్నట్లు సినీనటుడు, నృత్యదర్శకుడు రాఘవ లారెన్స్‌ ప్రకటించారు. పీఎం కేర్స్‌ ఫండ్‌, తమిళనాడు ముఖ్యమంత్రి సహాయనిధి, ఫెఫ్సీ, తన ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న డ్యాన్సర్ల యూనియన్‌కు రూ.50 లక్షల చొప్పున ప్రకటించారు. తన సంరక్షణలో ఉన్న దివ్యాంగులకు రూ.25 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. తన స్వగ్రామం తమిళనాడులోని రాయపురం ప్రాంతం దేశీయనగర్‌లోని దినసరి కూలీలు, పేదలకు ఆహారం, నిత్యావసర సరకులు అందించడానికి రూ.75 లక్షలు అందిస్తానని వెల్లడించారు.

* పొట్టకూటి కోసం రాష్టాలు దాటి వెళ్లిన ఆ అభాగ్యులు కరోనా కారణంగా పనులు లేక ఇంటిబాట పట్టారు. వేల కిలోమీటర్ల దూరం నడుస్తూ గురువారం తిరువూరు చేరిన ఆ నిరుపేదలను అధికారులు బాలికోన్నత పాఠశాల లో ఏర్పాటు చేసిన షెల్టర్ హోమ్ కు తరలించారు. చెన్నై నుంచి 8మంది 9 రోజుల క్రితం కాలినడకన బయల్దేరిన ఉత్తర ప్రదేశ్ రాష్ర్ట వాసులు తిరువూరు లోని రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు అడ్డుకోవడం తో అక్కడే వేచిచూశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వారిని షెల్టర్ హోమ్ కు తరలించారు.

* కరోనా మహమ్మారి విసిరిన పంజాకు మహారాష్ట్రలోని ముంబయి నగరం విలవిలలాడుతోంది. ఈ ఒక్క రోజే నగరంలో 218 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా.. 10 మంది మృతి చెందినట్టు బృహాన్‌ ముంబయి కార్పొరేషన్‌ (బీఎంసీ) వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి ముంబయి మహా నగరంలో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసులు 993కి చేరగా.. మృతుల సంఖ్య 64కి చేరింది.

* కరోనా వైరస్‌ నేపథ్యంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న వేళ సుమారు 20 వేల నిరుపేద కుటుంబాలకు నిత్యవసరాలు అందించడానికి ప్రముఖ సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సంస్థ ‘హలో’ ముందుకొచ్చింది. గివ్‌ ఇండియా, యాక్షన్‌ ఎయిడ్‌ స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ‘మే భీ కొవిడ్ ‌వారియర్’ అనే క్యాంపెయిన్‌కు శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా పేదవారికి నిత్యావసర వస్తువులతో పాటు శాటిటైజేషన్‌ కిట్లు అందించాలని నిర్ణయించింది. అందుకోసం రూ.5 కోట్లు వెచ్చిస్తుండటం గమనార్హం.