Movies

అతను మానడంలేదు

Actor Chiyaan Vikram Quitting Movies Fake News

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విక్రమ్‌ త్వరలో సినిమాల నుంచి పూర్తిగా బ్రేక్‌ తీసుకోనున్నారంటూ వస్తోన్న వార్తలపై ఆయన పీఆర్వో స్పందించారు. విక్రమ్‌ గురించి వస్తోన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం ‘కోబ్రా’ సినిమాలో నటిస్తున్న విక్రమ్‌ త్వరలో సినిమాల నుంచి పూర్తిగా బ్రేక్‌ తీసుకుని తన కుమారుడు ధ్రువ్‌ కెరీర్‌పై దృష్టి సారించనున్నట్లు ఇటీవల ఓ స్థానిక పత్రికలో వార్త ప్రచూరితమైంది. దీంతో విక్రమ్‌ అభిమానులు ఆశ్చర్యానికి, నిరాశకులోనయ్యారు. విక్రమ్‌ సినిమాల్లో కొనసాగాలంటూ నెట్టింట్లో ట్వీట్ల వర్షం కురిపించారు.