Movies

మోడీకి కంగనా ప్రశంసలు

Actress Kangana Ranaut Coronvirus News

ప్రధాని మోదీ ఓ గొప్ప నాయకుడని బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ ప్రశంసించారు. ప్రపంచ దేశాల్ని కరోనా వైరస్‌ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో ఆరంభ దశలోనే వైరస్‌ కట్టడి కోసం భారత ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది. దేశమంతా లాక్‌డౌన్‌ విధించింది. ప్రధాని మోదీ తనదైన వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కంగన ఓ ఆంగ్ల వెబ్‌సైట్‌తో మాట్లాడారు. ప్రస్తుతం ఆమె మనాలీలో తన కుటుంబంతో సమయం గడుపుతున్నారు.