అనంతపురం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో) అనిల్ కుమార్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం ఉదయం ఇంట్లో ఉన్న సమయంలో మంచినీళ్లు అనుకుని పొరపాటున పక్కనే ఉన్న శానిటైజర్‌ను రెండు గుటకలు వేశారు. వెంటనే అప్రమత్తమైన ఆయన కుటుంబ సభ్యులు సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు.. ప్రాణాపాయం లేదని, చికిత్స అనంతరం 2..3గంటల్లో డిశ్చార్జి చేస్తామని తెలిపారు. పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆసుపత్రికి చేరుకుని అనిల్‌కుమార్‌ను పరామర్శించారు.
పేరుకు జిల్లా వైద్యాధికారి…తాగింది శానిటైజర్
Related tags :