Editorials

తాష్కెంటులో భారత కమ్యూనిస్టు పార్టీని స్థాపించిన MNRoy-ఇన్నయ్య ముచ్చట్లు

MN Roy Begins Indian Communisty Party In Tashqent

ప్రథమ కమ్యూనిస్టు యూనివర్సిటీలో రాయ్ దంపతులు
(1921)

ద్వితీయ అంతర్జాతీయ కమ్యూనిస్టు మహాసభలు పెట్రోగ్రాడ్, మాస్కోలో ముగిసిన తరవాత 1921 ఏప్రిల్ 21న తొలిసారిగా కమ్యూనిస్టు యూనివర్సిటీ ప్రారంభించారు. దీనికి అధినేతగా స్టాలిన్ వుండగా, ఎమ్.ఎన్.రాయ్ డైరెక్టర్ గా ఉన్నారు. ప్రపంచ కమ్యూనిస్టు సభలకు హాజరయిన వారిని, మరికొందరిని విద్యార్థులుగా స్వీకరించారు. భిన్న భాషలు మాట్లాడేవారు. కొత్తగా కమ్యూనిస్టులయిన వీరందరికీ సిద్ధాంత రీత్యానూ, ఆచరణలో చేపట్టవలసిన అంశాల గురించి, ఎత్తుగడల గురించి శిక్షణ ఇవ్వడానికి యూనివర్సిటీ తలపెట్టింది. ఇంకా అనేక దేశాలలో కమ్యూనిస్టు పార్టీ ఏర్పడవలసివున్నది. అప్పటికే కమ్యూనిస్టు పార్టీ స్థాపించిన చోట ఆయా ప్రభుత్వాలు వాటిని నిషేధించాయి. కమ్యూనిస్టులు రహస్య జీవితాన్ని గడపవలసిన స్థితి ఏర్పడింది. ఎత్తుగడలు వ్యూహాలు ఎలా వుండాలి, ప్రజలలోకి సిద్ధాంతాన్ని తీసుకువెళ్ళి పోరాటాలకు సిద్ధం చేసే పద్ధతులు త్వరిత గతిన చేపట్టవలసి వున్నది. వీటన్నిటి దృష్ట్యా ప్రథమ కమ్యూనిస్టు యూనివర్సిటీకి చాలా ప్రాధాన్యత ఏర్పడింది. యూనివర్సిటీలో చదివినవారు తమ దేశాలకు వెళ్ళి, రాజకీయ రహస్య శిక్షణా తరగతులు పెట్టి సిద్ధాంతం ఆచరణ వ్యాపించ వలసిన ఆవశ్యకత వున్నది.
రష్యాలో అగ్ర కమ్యూనిస్టు నాయకులు లెనిన్ మొదలు అనేకమంది యూనివర్సిటీకి వచ్చి ఆయా విషయాలపై ప్రసంగాలు చేశారు. పాల్గొన్న విద్యార్థులకు వసతి సౌకర్యాలు ఏర్పాటు చేయటంలో చాలా కృషి చేయవలసి వచ్చింది. వీరు వివిధ దేశాలవారు కావటం భిన్న ఆహార నియమాలకు అలవాటు పడటం వలన వారందరికీ రష్యా రొట్టెలు, కూరలు, అంతగా అలవాటు లేనందువలన కొన్ని ఇబ్బందులకు గురికావలసి వచ్చింది. విద్యార్థులకు మాస్కో చుట్టుపట్ల ప్రాంతాలను పరిచయం చేయటానికి ఏర్పాటు కూడా చేశారు. భాషాపరంగా మరికొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నారు. వీటన్నిటి మధ్య తరగతులు జయప్రదంగానే నిర్వహించారు.
మొదటి కమ్యూనిస్టు యూనివర్సిటీలో విద్యార్థులుగా సభలకు వచ్చినవారిని, అతిథులుగా వచ్చిన వారిని స్వీకరించారు. ఎమ్.ఎన్.రాయ్ భార్య ఎవిలిన్ ట్రెంట్ ప్రధాన ఉపాధ్యాయురాలుగా ఉన్నది. ఈ సభలలో పాల్గొన్నవారి వైవిధ్యం ప్రత్యేకించి పేర్కొనబడినది. ఉత్తరోత్తరా వియత్నాం అధినేత అయిన హోచ్ మిన్ మొదలు ఎందరో ఇందులో పాల్గొన్నారు. రష్యా కమ్యూనిస్టు పార్టీతో సంబంధం వున్నవారికి ఆయా దేశాలలో ఆంక్షలు వున్నాయి. వీటన్నిటి దృష్ట్యా రాజకీయ పాఠశాల ప్రాధాన్యత చాలా పెరిగిపోయింది. ఇందులో పాల్గొన్నవారి వైవిధ్యం గమనిస్తే ఈ పాఠశాల క్లిష్టదశ అవగాహన అవుతుంది.
రాజకీయ పాఠశాలలో తర్ఫీదు పొందినవారు :
పూర్తి ప్రాతినిధ్యం
1. రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ (బోల్షెవిక్స్), 2. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ జర్మనీ, 3. సోషలిస్టు లేబర్ పార్టీ ఆఫ్ అమెరికా, 4. జర్మన్ ఆస్ట్రియా కమ్యూనిస్టు పార్టీ, 5. బాల్కన్ రివల్యూషనరీ సోషల్ డెమోక్రటిక్ ఫెడరేషన్, 6. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఫిన్లాండ్, 7. హంగరీ కమ్యూనిస్టు పార్టీ, 8. నార్వే లేబర్ పార్టీ, 9. పోలాండ్ కమ్యూనిస్టు పార్టీ, 10. స్వీడన్ లెఫ్ట్ పార్టీ ఆఫ్ స్వీడన్, 11. స్విస్ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ (ప్రతిపక్షం), 12. ఉక్రెయిన్ కమ్యూనిస్టు పార్టీ, 13. కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ అర్మేనియా, 14. రష్యా యొక్క తూర్పు పీపుల్స్ యునైటెడ్ గ్రూప్, 15. ఎస్టోనియా కమ్యూనిస్టు పార్టీ, 16. జిమ్మెర్వాల్డ్ ఫ్రాన్స్ యొక్క ఎడమ, 17. రష్యాలో జర్మన్ వలసవాదుల కమ్యూనిస్ట్ పార్టీ, 18. లాట్వియా కమ్యూనిస్టుపార్టీ, 19. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ లిథువేనియా మరియు బెలోరస్సియా, 20. కన్సల్టెంట్ ప్రతినిధులు, 21. రష్యన్ కమ్యూనిస్ట్ పార్టీ (బోల్షెవిక్స్), 22. బల్గేరియన్ కమ్యూనిస్ట్ గ్రూప్, 23. తూర్పు పీపుల్స్ సెంట్రల్ బ్యూరో, 24. చైనీస్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ, 25. చెక్ కమ్యూనిస్ట్ గ్రూప్, 26. ఫ్రెంచ్ కమ్యూనిస్టు గ్రూప్, 27. బ్రిటిష్ కమ్యూనిస్ట్ గ్రూప్, 28. కొరియన్ వర్కర్స్ లీగ్, 29. డచ్ సోషల్ డెమోక్రటిక్ గ్రూప్, 30. స్విస్ కమ్యూనిస్ట్ గ్రూప్, 31. సోషలిస్ట్ ప్రోపగండ లీగ్ ఆఫ్ అమెరికా, 32. యుగోస్లావ్ కమ్యూనిస్ట్ గ్రూప్, 33. జిమ్మెర్వాల్డ్ కమిటీ

సభలో పాల్గొన్న ప్రతినిధులు
ఆర్మేనియా: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ అర్మేనియా – అవిస్, సెరత్జాన్
ఆస్ట్రియా: ఆస్ట్రియా కమ్యూనిస్ట్ పార్టీ – రెయిస్లర్, కార్ల్ స్టెయిన్హార్డ్, స్ట్రోమర్, కార్ల్ టోమన్
అజర్బైజాన్: కమ్యునిస్ట్ పార్టీ ఆఫ్ అజర్బైజాన్ – శాపునోవ్
బెల్జియం: యంగ్ సోషలిస్ట్ గార్డ్ – ఎడ్వర్డ్ వాన్ ఓవర్స్ట్రెటెన్
బల్గేరియా: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బల్గేరియా – క్రిస్టో కబాకిచ్వ్, నికోలా మాక్సిమోవ్, ఎన్. షాబ్లిన్ (ఇవాన్ నెడెల్కోవ్)
చెకోస్లోవకియా: చెకోస్లోవకియా కమ్యూనిస్టు పార్టీ – ఇవాన్ ఆల్బ్రచెట్
చేకోస్లోవకియా: కార్మిక జాతీయ సమాఖ్య – బ్రెట్లావ్ హౌలా
చేకోస్లోవకియా: లెఫ్ట్ వింగ్ ఆఫ్ ది సోషల్ డెమోక్రటిక్ పార్టీ – మిలోస్ వనేక్, ఆంటొనిన్ జాపోటోకి
డెన్మార్క్: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ డెన్మార్క్ – మేరీ-సోఫీ నీల్సన్
డెన్మార్క్: లెఫ్ట్ సోషలిస్ట్ పార్టీ – జోర్గేన్సేన్
తూర్పు గలిసియా / బుకోవినా: గలీసియా మరియు బుకోవినా కమ్యూనిస్ట్ పార్టీ – బారల్, లెవిట్స్కీ, మిత్రా
ఈస్టోనియా: ఈస్టోనియా కమ్యూనిస్టు పార్టీ – హన్స్ పోగోల్మాన్, రుడాల్ఫ్ వాక్మాన్
13. ఫిన్లాండ్: కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఫిన్లాండ్ – ఒట్టో విల్లె కుయుసినేన్, లూరి లెటోమాన్, జోహన్ హెన్రిక్ లూమివోకోకో, కుర్వెర్వ్ మానేర్, జుకా రహజా
14. ఫ్రాన్స్: థర్డ్ ఇంటర్నేషనల్ కమిటీ – రేమండ్ లేఫెబ్రేవ్, ఎస్. మైన్ఫ్ (వానిని), ఆల్ఫ్రెడ్ రోస్మెర్
15. ఫ్రాన్స్: ఫ్రాన్స్ యొక్క సామ్యవాద పార్టీ – హెన్రి గుయిల్బెయాక్స్, జాక్యూస్ సాడోల్
16. జార్జియా: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ జార్జియా- ఫిలిప్ మఖరాజ్, మికాడ్జ్, మిఖ-త్చఖాయ (బార్సోవ్), సిల్వెస్ట్రి తోడ్రియ, వకాషిడ్జ్, వార్డున్జాన్
17. జర్మనీ: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ జర్మనీ – విల్లీ బుడిచ్, పాల్ లెవి, ఎర్న్స్ట్ మేయర్, జాకబ్ వాల్చెర్, రోసీ వోల్ఫ్స్టెయిన్
18. జర్మనీ: కమ్యూనిస్ట్ యూత్ – లెయిన్ హార్డ్ట్
19. గ్రేట్ బ్రిటన్: బ్రిటిష్ సోషలిస్ట్ పార్టీ – విలియం మెక్లైన్, టామ్ క్వెల్చ్
20. గ్రేట్ బ్రిటన్: ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ – రిచర్డ్ బీచ్
21. గ్రేట్ బ్రిటన్: షాప్ స్టీవార్డ్స్ ఉద్యమం – విల్లీ గాలాచెర్, జె.టి. మర్ఫీ, డేవిడ్ రామ్సే, జాక్ టాన్నర్
22. హంగేరి: హంగరీ కమ్యూనిస్టు పార్టీ – మాటిస్ రాకోసి, ఎండ్ర్ రుద్రనీన్స్కీ, యుగెన్ వర్గ,
23. భారతదేశం: (ఏ పార్టీ అనుబంధం లేదు)- అబనీ ముఖర్జీ
24. ఇండోనేషియా: కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండోనేషియా – హెంక్ స్నీవ్విట్ “మింగ్”
టాన్ మలాకా
25. ఐర్లాండ్: కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఐర్లాండ్ –
ఐర్లాండ్: ఇండస్ట్రియల్ వర్కర్స్ ఆఫ్ ది వరల్డ్ – రోడి కొన్నోల్లీ (ఎన్)
26. ఐర్లాండ్: ఐరిష్ లేబర్ పార్టీ – పాట్రిక్ క్విన్లాన్ (“వై”)
27. ఇటలీ: సోషలిస్టు పార్టీ ఆఫ్ ఇటలీ – నికోలా బాంబోసిస్, ఆంటోనియో గ్రేజిడే, లుయిగి పొలానో, గియాసినో మెనోట్టి సంరతి,
28. కొరియా: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ కొరియా – పాక్ చిన్-సన్
29. లాట్వియా: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ లాట్వియా – డావిడ్స్ బెకాకా, బ్లాంక్-బెర్గ్, కె. క్రాస్టిస్, పేటర్ స్టుక్కా
30. లిథువేనియా: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ లిథువేనియా – విన్కాస్ మిక్వివిసియస్-కప్సుకాస్, రసికాస్,
31. మెక్సికో: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మెక్సికో – ఎమ్. ఎన్. రాయ్, చార్లెస్ షిప్మాన్ (“ఫ్రాంక్ సీమన్”)
32. నెదర్లాండ్స్: కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ హాలండ్ – జాన్ ప్రోస్ట్ జాన్సెన్, డేవిడ్ విజ్నోకోప్
33. నార్వే: 2 – క్రిస్టియన్ క్రిస్టెన్సేన్ (ఎ), ఎనార్ గెర్హార్డ్సేన్ (ఎన్.ఎస్.యు), జాకబ్ ఫ్రైస్ (ఎ), స్వెర్వే క్రోఘ్ (ఎన్.ఎస్.యు), హవార్డ్ లాంగ్సత్ (ఎ), అల్ఫ్రెడ్ మాడ్సన్ (ఎల్.ఒ.)
34. హాన్స్ మెడ్బి (ఎన్.ఎస్.యు.), అగస్టా ఆసెన్ (ఎ) – కాంగ్రెస్ సమయంలో మరణించారు, ఓలావ్ స్చెఫ్లో (ఎ), సిగ్రిడ్ సివెర్త్సన్ (ఎ)
35. పర్షియా: పర్షియా కమ్యూనిస్టు పార్టీ – అబిటిస్ సోల్టాన్జడే
36. పోలాండ్: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ పోలాండ్ – జూలియన్ మార్లేవిస్కి (కార్స్కి)
37. రష్యా: రష్యా కమ్యూనిస్ట్ పార్టీ (బోల్షెవిక్స్) – ఎలివ్, ఎలెక్సీవ్, ఆండ్రీ ఆండ్రీవ్, ఇసినసా అర్మాండ్, అర్తెమ్ (ఎఫ్.ఎఫ్. సెర్జీవ్), అఖున్ డొవ్, బెయిటుర్ సునొవ్, జానిస్ కె. బెరిజ్స్, వాసిలీ బ్లాకిట్నీ, నికోలాయ్ బుకరిన్, చెర్నోవ్, రాయ దయేవ్స్కాయా, ఫెలిక్స్ డెర్జింన్స్కి, అబెల్ ఎనక్బియా, సెరాఫిమా గోప్నర్, ఫిర్జొవ్, గలిమ్జాన్ ఇబ్రహిమోవ్, ఇడ్రిసొవ్, ఇ.ఎన్. ఇగ్నెటొవ్, అడాల్ఫ్ జోఫ్ఫ్, మిఖైల్ కాలిన్న్, ఫైజుల్లా ఖోజవ్, ఫెలిక్స్ కోహ్న్, అలెగ్జాండ్రా కొల్లొంటై, అలెగ్జాండర్ క్రాస్నోష్చియోకోవ్, నికోలాయ్ క్రెటిన్స్కీ, నదెస్తాడా క్రుప్స్కాయా, వ్లాదిమిర్ లెనిన్, అలెగ్జాండర్ లోజోవ్స్కీ, అనటోలీ లునాచార్స్కీ, మెజొరొవా, డిమిత్రి మనుల్స్కి, మిరెషిన్, మిఖైల్ ఓల్మిన్స్కీ, వలేరియన్ ఒసిన్స్కీ, మిఖాయిల్ పావ్లోవిచ్-వెల్ట్మన్, స్టానిస్లవ్ పెస్టోవ్స్కి, మిఖాయిల్ పోకోవ్స్కీ, పోస్నెర్, యవ్జెనీ ప్రెబ్రోజెన్స్కై, కార్ల్ రడేక్, రఫెస్, క్రిస్టియన్ రాకోవ్స్కి, రామొనొవ్, డేవిడ్ రియాజనోవ్, రివ్కిన్, జానిస్ రుడ్జుతక్స్, అలెక్సే రికోవ్, ఆస్కార్ రివ్కిన్, సాదొవ్ స్కెయా, జి.ఐ. సఫోరొవ్, సఖారొవ్, సెకిబ్గరే సెడ్-గలివ్, లియోనిడ్ సెరెబ్రియకోవ్, అలెగ్జాండర్ షాలిప్నికోవ్, షమ్ స్కై, నికోలాయ్ స్క్రాప్కిన్, పీటర్ స్మిడోవిచ్, వ్లాదిమిర్ సోరిన్, గ్రిగోరీ సోకోల్నికోవ్, ఐరిటి స్టెక్లోవ్, మిర్సిఎట్ సోల్టాన్గాలివ్, టాయెట్లిన్, విక్టర్ తారతు, లియోన్ ట్రోత్స్కీ, మిఖైల్ టామ్ స్కి, గ్రిగోరి సైపర్యోవిచ్, వాడిమ్ వాటిన్, వొరొనోవా, ఎమిలియన్ యరోస్లావ్స్కీ, యాన్సన్, జెయిట్లిన్, గ్రిగోరీ జినోవివ్
38. స్పెయిన్: నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లేబర్ – ఏంజెల్ పెస్టానా
39. స్వీడన్: లెఫ్ట్ సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ స్వీడన్ – కటా డాల్స్ట్రోమ్, స్వెన్ లింండర్
40. స్విట్జర్లాండ్: స్విట్జర్లాండ్ కమ్యూనిస్టు పార్టీ (ఫోర్డర్ంగ్) – మద్దతుదారు, జాకబ్ హెర్జోగ్
41. స్విట్జర్లాండ్: సోషల్ డెమోక్రాటిక్ పార్టీ లెఫ్ట్ – వాల్తేర్ బ్రింఫ్ఫ్ఫ్, జూల్స్ హంబర్ట్-డ్రోజ్
42. యునైటెడ్ స్టేట్స్: కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ అమెరికా – లూయిస్ ఫ్రెనా, అలెగ్జాండర్ స్టాక్లిట్స్కి
43. యునైటెడ్ స్టేట్స్: కమ్యూనిస్ట్ లేబర్ పార్టీ అఫ్ అమెరికా – అలెగ్జాండర్ బిలాన్, ఎడ్వర్డ్ ఐ. లిండ్గ్రెన్ (“ఫ్లిన్”), ఈడ్ మన్ మేక్ఆల్ పైన్, జాన్ రీడ్
44. యునైటెడ్ స్టేట్స్: ఇండిపెండెంట్ సోషలిస్ట్ యూత్ – ఛాబ్రొవ్, జుర్గిస్
45. యుగోస్లేవియా: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ యుగోస్లేవియా – ఇలిజా మిల్కిక్
46. కమ్యూనిస్ట్ యూత్ ఇంటర్నేషనల్ – సిగి బామేటర్ (స్విట్జర్లాండ్), విల్లీ మున్జెన్బర్గ్ (జర్మనీ), లాజర్ షాట్కిన్ (రష్యా)

సంప్రదింపుల ప్రతినిధులు (వాయిస్, ఓటు లేదు)
1. ఆస్ట్రేలియా: కమ్యూనిస్ట్ లీగ్ – ఫ్రీమాన్, సుసెన్ కో, 2. ఆస్ట్రియా: పోల్ సీయోన్ – కోన్-ఎబెర్, 3.బుఖారా: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ బుఖారా – మచమడ్యెర్, 4. చైనా: చైనీస్ సోషలిస్ట్ వర్కర్స్ పార్టీ – లావో హ్జియు-చావో, ఎన్ ఎన్-హక్ 5. చెకోస్లోవేకియా: కమ్యూనిస్ట్ గ్రూప్ – మలినొవ్, సొన్నెన్స్టెయిన్, 6. ఎస్టోనియా: ఇండిపెండెంట్ సోషలిస్ట్ పార్టీ – జోనస్, 7. ఫిన్లాండ్: కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఫిన్లాండ్ – ఎడ్వర్డ్ గైలింగ్, కుస్టా రోవియో, తమ్మెనొస్కా, 8. ఫ్రాన్స్: రివల్యూషనరీ స్టూడెంట్ – గోల్టెన్ బెర్గ్, 9. ఫ్రాన్స్: విభాగం ఫ్రాంకాయిస్ డి ఇంటర్ ఇంటర్నేషనల్ ఒవ్రియేర్ – మార్సెల్ కాచిన్, లుడోవిక్-ఆస్కార్ ఫ్రోసార్డ్, 10. ఫ్రాన్స్: (ఎటువంటి పార్టీ అనుబంధం లేదు) – ఎ.ఇ. అబ్రమోవిచ్, 11. జర్మనీ: ఇండిపెండెంట్ సోషల్ డెమోక్రాటిక్ పార్టీ – ఆర్థర్ క్రిస్పియన్, ఎర్నస్ట్ డామిగ్, విల్హెల్మ్ డిట్మ్యాన్, గ్రేట్ బ్రిటన్: నేషనల్ లీగ్ ఆఫ్ లేబర్ యూత్, వాల్టన్ న్యూబోల్డ్, 12. గ్రేట్ బ్రిటన్: వర్కర్స్ సోషలిస్ట్ ఫెడరేషన్ – సిల్వియా పాంఖర్స్ట్, 13. ఐస్లాండ్: ఐస్లాండిక్ లేబర్ పార్టీ – బ్రైన్జొల్ఫూర్ బ్జార్సన్, హెండ్రిక్ సిఎమ్సెన్ ఒట్టోసన్, 14. భారతదేశం – ఎమ్. పి. బి. టి. ఆచార్య 15. ఇటలీ: సోషలిస్టు పార్టీ ఆఫ్ ఇటలీ – అమేడియో బోర్డిగా, ఎమిలియో కొలంబినో, డి ఆరగాన్, పావెరిని, విన్సెంజో వాసిర్కా, 16. మెక్సికో: కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మెక్సికో – హెలెన్ అలెన్, 17. పర్షియా: పర్షియా కమ్యూనిస్టు పార్టీ – హస్సనొవ్, ఒరుడ్షెవ్, 18. రష్యా: కమ్యూనిస్ట్ బండ్ – మోసి లిట్వాకోవ్, అరోన్ వీన్స్టీన్, 19. రష్యా: పార్టీ రివల్యూషనరీ కమ్యూనిజం – సపొష్ నికొవ్, ఉస్తినోవ్, 20. యునైటెడ్ స్టేట్స్: (ఏ పార్టీ అనుబంధం పేర్కొనబడలేదు) – గిల్డియ, 21. కమ్యూనిస్ట్ ఇంటర్నేషనల్ యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ – ఏంజెలికా బెలాబనోవా (రష్యా), లేవ్ కరాఖాన్ (రష్యా), గుస్తావ్ క్లింగర్ (రష్యా), మెన్షొయ్

ఎమ్.ఎన్.రాయ్ అతని భార్య ఎవిలిన్ యూరోప్ నుండి నడిపిన వ్యాన్ గార్డ్, అడ్వాన్స్ వ్యాన్ గార్డ్, మాసెస్ పత్రికలలో ఈ యూనివర్సిటీ విశేషాలు ప్రస్తావించారు. ఎవిలిన్ తన తల్లికి రాసిన ఉత్తరాలలో కూడా కొన్ని సంగతులు పేర్కొన్నది. అందువలన ఇవి ప్రస్తావించడానికి వీలయినది.
యూనివర్సిటీలో చదువుకున్నవారు తమ తమ దేశాలకు వెళ్ళిపోయారు. ఇండియా ప్రతినిధిగా పాల్గొన్న అవనీ ముఖర్జీ తిరిగి వెళ్ళకుండా రష్యాలోనే స్థిరపడిపోయారు.
వివిధ దేశాలలో కమ్యూనిస్టు పార్టీని స్థాపించడానికి, పత్రికలు నిర్వహించడానికి, రాజకీయ శిక్షణ తరగతులు జరపడానికి, మాస్కో నుండి వెళ్ళినవారు కృషి చేశారు. చాలావరకు ఈ కార్యకలాపాలు రహస్యంగానే జరిగాయి.

#######################################################

భారత కమ్యూనిస్టు పార్టీని తాష్కెంటులో స్థాపించిన తీరు

తాష్కెంటుకు పయనించిన రాయ్ దంపతులు
రష్యాలో ద్వితీయ ప్రపంచ కమ్యూనిస్ట్ మహాసభ జరిగిన అనంతరం, కొందరికి రాజకీయ శిక్షణ ఇచ్చిన తరువాత, రాయ్ దంపతులను ఎలా పార్టీకి ఉపయోగించుకోవాలని లెనిన్, కమ్యూనిస్ట్ నాయకులు ఆలోచించారు. రాయ్ ను రాయబారిగా ఆఫ్ఘనిస్టాన్ పంపాలని తొలుత భావించారు. అయితే అక్కడి రాజు, పాలకులు బ్రిటీష్ వారిపట్ల ఊగిసలాడుతూ వుండటం వలన రాయ్ బదులు మరొకరిని నియమించటానికి నిర్ణయించుకుని, కమ్యూనిస్టు పార్టీ స్థాపనకై రాయ్ సేవలను ఉపయోగించాలనుకున్నారు. దీనికి గాను లోగడ రాయ్ తలపెట్టిన పథకాన్ని కొత్త రీతులలో అమలుపరచాలని భావించారు. అదేమంటే సరిహద్దులలో వున్న కొండజాతులవారిని సమకూర్చి వారికి ఆయుధాలు అందించి బ్రిటీషు వారిపై ఇండియాలో తిరుగుబాటు చేయించేటట్లు పథకం వేశారు. అది అమలుపరచటానికి సమయం ఆసన్నమయిందని రష్యా భావించి రాయ్ దంపతులకు రెండు రైళ్ళనిండా ఆయుధ సామగ్రి నింపి పంపించారు. మాస్కో నుండి తాష్కెంట్ కు 3,390 కి.మీ. దూరం ఉంది. త్రోవలో అక్కడక్కడ కొన్ని ముఠాలు రైలు దోపిడీకి విఫల ప్రయత్నాలు చేశారు. దాదాపు వారం రోజులు ప్రయాణం చేసి, అక్కడక్కడ ఇబ్బందులు ఎదురైనా తప్పించుకుని సురక్షితంగా ఆయుధాలతో తాష్కెంట్ చేరగలిగారు. అక్కడ ఆనాడు కమ్యూనిస్టు నాయకుడు ఫైజుల్లా ఖోజ్ సంపూర్ణ సహకారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న భారత ముజహిర్ లను సమకూర్చి శిక్షణ తరగతులకు సిద్ధమయ్యారు. ముందుగా భారత కమ్యూనిస్టు పార్టీని ప్రవాస పార్టీగా ప్రారంభించడానికి పూనుకున్నారు. ఒక ప్రణాళిక సిద్ధం చేసి దానిని విడుదల చేశారు. ఎమ్.ఎన్.రాయ్, ఎవిలిన్ ట్రెంట్, అవనీ ముఖర్జీ, రోజా పిటింగోవ్, మహమ్మద్ ఆలీ, మహమ్మద్ షఫీక్, ఆచార్య షఫీక్ లు ప్రవాస కమ్యూనిస్టు పార్టీ ప్రణాళికపై సంతకాలు చేశారు. ప్రధాన కార్య నిర్వాహకుడుగా ఎమ్.ఎన్.రాయ్ ఛైర్మన్ గా ఆచార్య ఉన్నారు. పార్టీని టర్కిస్థాన్ లో ఆధికారికంగా రిజిస్టర్ చేశారు. భారతదేశం నుండి వచ్చినవారిలో అర్హులనుకున్న వారిని ఎంపిక చేసి సైనిక శిక్షణ ప్రారంభించారు. ఈ నిమిత్తం మిలటరీ స్కూలు పెట్టారు. భారత కమ్యూనిస్టు పార్టీ చరిత్రను ముజఫర్ అహమ్మద్, జి. అధికారి విడివిడిగా రాశారు. అందులో సంక్షిప్తంగా భారత కమ్యూనిస్టు పార్టీని తాష్కెంటులో ఏర్పాటు చేసిన విధం సంతకాలు చేసిన వారి పేర్లు రికార్డు చేశారు.
ఇండియా నుంచి వచ్చిన వారిలో కొందరు కెమాల్ పాషా (1818-1928) ఖిలాఫత్ ఉద్యమంలో చేరడానికి టర్కీ వెళ్ళిపోగా అలా వెళ్ళలేని వారు తాష్కెంట్ చేరుకున్నారు. వారికి శిక్షణ ఇవ్వటం జయప్రదంగా సాగింది. రైఫిల్ వాడటం, విమానం ఇంజను ఎలా పనిచేస్తుందో తెలియపర్చటం వంటి ప్రాథమిక శిక్షణలు ఇచ్చారు. మరొకవైపు కమ్యూనిస్టు సిద్ధాంతాలను వారికి అవగాహన చేయించారు. వారందరినీ ఇండియా వెళ్ళి కమ్యూనిస్టు పార్టీ స్థాపించి పనిచేయమని పంపించారు.
రాయ్ దంపతులు తాష్కెంట్ నుండి మాస్కోకు తిరిగి వచ్చారు. తాష్కెంటులో సైనిక కేంద్రం కార్యకలాపాలను భారతదేశంలో వున్న బ్రిటీషు ప్రభుత్వం శ్రద్ధగా గమనించింది. శిక్షణ పొందినవారు తిరిగి భారతదేశంలో ప్రవేశించగానే అరెస్టు చేశారు. ఉత్తరోత్తరా వారిపై పెషావర్, మీరట్, కాన్పూరు కుట్ర కేసులు పెట్టి జైలుపాలు చేశారు. అయితే దేశంలో కమ్యూనిస్టు పార్టీకి ఈ సంఘటనలన్నీ ప్రోత్సాహాన్ని కలిగించాయి. బొంబాయి, కలకత్తా తదితర ప్రదేశాలలో చిన్న చిన్న కమ్యూనిస్టు గ్రూపులు ఏర్పడ్డాయి. వారందరూ బ్రిటీషు పాలకుల దమన చర్యకు గురయ్యారు.
ఎమ్.ఎన్.రాయ్ తన జీవితం చివరి దశలో ఈ సంఘటనల పై స్వీయగాథలు రాశారు. అవి 1925 వరకే రాయగలిగారు. ఆ తరువాత మెదడుకు తగిలిన దెబ్బ వలన ఆయన డెహ్రాడూన్ లో చనిపోయారు. స్వీయగాథల అనుభవాలు తన రెండవ భార్య ఎలెన్ కు చెబుతూ పోయాడు. ఆమె షార్ట్ హాండ్ లో రాసుకుని తరువాత ప్రచురించింది. అయితే ఈ గాథలలో రాయ్ తన మొదటి భార్యను గురించి ఎక్కడా ప్రస్తావించక పోవటం చాలా పెద్ద లోపంగా వున్నది.
రాయ్ దంపతులకు రష్యాలో పార్టీ కార్యక్రమం నిర్వహించే బాధ్యతలు, భారతదేశానికి సాహిత్యాన్ని అందజేయడం, అప్పటికప్పుడు వ్యూహాన్ని అందించటం రాయ్ దంపతుల బాధ్యతగా పేర్కొన్నారు. లెనిన్, స్టాలిన్ తో రాయ్ సన్నిహితంగా వుంటూ భారతదేశంలో పార్టీకి ఎలా తోడ్పడాలో వ్యూహం పన్నారు. మాస్కో నుండి భారతదేశానికి సాహిత్యం పంపటం, కమ్యూనిస్టు పార్టీకి సహాయం అందించటం జటిలమైన పనిగా తోచింది. పత్రికలు స్థాపించి వాటిద్వారా సిద్ధాంతాన్ని ఆచరణలో అప్పటికప్పుడు తెలియజేయడానికి వీలుగా బెర్లిన్ కు మకాం మార్చారు. తరచు ఫ్రాన్స్ బెల్జియం, స్విజర్లాండ్, నెదర్లాండ్ నుండి సాహిత్యాన్ని పంపగలిగారు. అయితే బ్రిటీషు ప్రభుత్వం మాత్రం వీరిని వదిలిపెట్టకుండా వెంటాడుతూ పోయింది.