తానా ఫౌండేషన్ కోశాధికారి, హైదరాబాద్‌లో ప్రముఖ సాఫ్ట్వేర్ సంస్థ QHub నిర్వాహకుడు వల్లేపల్లి శశికాంత్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు హైదరాబాద్ గోషామహల్ ప్రాంతంలో పేదలు, పారిశుద్ధ్య కార్మికులకు భోజనం, మాస్క్‌లను అందజేశారు. ఈ కార్యక్రమంలో TRS నాయకుడు రాహుల్ రావు తదితరులు పాల్గొన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ నేపథ్యంలో నిరాశ్రయులైన పేదలకు 50వేల భోజనాలను అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు శశికాంత్ TNIకు తెలిపారు. ఇప్పటివరకు 15వేలు పంపిణీ చేశామని, ఈ భోజనాలతో పాటు మాస్క్‌లను కూడా అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.
50వేల భోజనాలు విరాళమందిస్తున్న శశికాంత్
Related tags :