Health

తెమడ పెరగడానికి కారణాలు ఇవి

Top reasons why your mucos is on high rise

పగటినిద్ర , వ్యాయామము చేయకపోవడం , బద్ధకం , మధుర, ఆమ్ల రసాలు గల పదార్దాలను ఎక్కువగా తీసుకోవడం , శీతల పానీయాలు ఎక్కువగా తాగడం, మినుములు , అలసందలు , పాత గోధుమల , పాత నువ్వులు , పిండివంటలు అతిగా తినటం వల్ల , పెరుగు , పాలు , పులగము , పాయసం అతిగా సేవించటం మాంసములు , వస వలన , తామరతూళ్లు , వట్టివేళ్ళు , నిమ్మదుంపలు , పరిక దుంపలు , మధురరసం కలిగిన పండ్లు , కాయలు , తీగ గుమ్మడి , దోస వలన శరీరంలో కఫం పెరుగుతుంది. శరీరంలో కఫం తగ్గినప్పుడు ఉష్ణం ఎక్కువై దేహానికి అనేక బాధలు కలుగుతాయి . భ్రమ , వొళ్ళు తిరుగుట , నిద్ర తక్కువ అవ్వడం , లేకపోవటం , ఒళ్ళు అంతా విపరీతమగు నొప్పి , నోరు తడి ఆరిపోవుట , మంటలు కలుగుట . స్ఫోటకం ఏర్పడి శరీరం నందు కురుపులు ఏర్పడి చిల్లులులా అవ్వడం , శరీరం వణుకుట , సంధులు శైధిల్యం పొంది కీళ్లు సడలుట , హృద్యమునందు పొరలు కరుగుట వంటి సమస్యలు తలెత్తుతాయి. మానవ శరీరం నందు శ్లేష్మము క్లోమము , ఊపిరితిత్తులు , శిరస్సు , మెడ , కీళ్లు , ఆమాశయము , మేథస్సు , ముక్కు , నాలుక భాగములు శ్లేష్మ స్థానములు .

Corona Virus Related Mucus In Nose Vector With Editable Stroke ...