కొరోనా ధృతరాష్ట్ర కౌగిట బందీగా చిక్కుకున్న న్యూజెర్సీ రాష్ట్రం దాని నుండి బయటపడేందుకు కఠోర నిబంధనలను అమలులోకి పెడుతోంది. ఆ రాష్ట్ర గవర్నర్ ఫిల్ మర్ఫీ అమెరికా జాతీయ వ్యాధుల నివారణ సంస్థ(CDC) సలహా మేరకు షాపింగ్‌కు వెళ్లే ప్రతి పౌరుడు విధిగా మాస్క్ ధరించాలని నిబంధన ఏర్పాటు చేశారు. మాస్క్ ధరించని వారిని దుకాణం నుండి వెళ్లవల్సిందిగా ఉద్యోగులు కోరవచ్చునని ఆయన స్పష్టం చేశారు. సాధారణ రద్దీ కన్నా సగం మందిని మాత్రమే ఒకేసారి దుకాణంలోకి అనుమతించాలని కూడా ఆయన నిబంధన ఏర్పాటు చేశారు. శుక్రవారం సాయంకాలానికి అమెరికావ్యాప్తంగా 5లక్షలకు పైగా పౌరులు కరోనా బారినపడగా 18వేలకు పైచిలుకు ప్రాణాలు వదిలారు.
న్యూజెర్సీలో షాపింగ్ చేయాలంటే మాస్క్‌లు తప్పనిసరి
Related tags :