* ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ భారతీయ టెకీకి భారీ షాకిచ్చింది. కరోనా వైరస్ పై తప్పుడు వార్తల్ని ప్రచారం చేస్తున్నాడని ఆరోపిస్తూ కాలిఫోర్నియాలోని ఫెడరల్ కోర్టులో దావా వేసింది. తన ప్రకటనల సమీక్ష ప్రక్రియను దాటవేయడం ద్వారా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో కరోనా వైరస్ వ్యాప్తి గురించి మోసపూరిత ప్రకటనలు, తప్పుడు సమాచారాన్ని అందించేలా సాఫ్ట్‌వేర్ కంపెనీని నడుపుతున్నందుకు ఫేస్‌బుక్ బసంత్ గజ్జర్ పై దావా వేసింది.
* కరోనా వైరస్…ఇది అతి సూక్ష్మ జీవి అయినా విశ్వం మొత్తాన్ని గజగజ లాడిస్తోంది. ఎక్కడ ఎలా పొంచి వుందో తెలిదు..ఎటునుంచి దాపురిస్తుందో తెలియదు..ఏ వస్తువుపై దాక్కొని ఎలా పంజా విసురుతుందో తెలియదు. దేశవ్యాప్తంగా 21రోజుల లాక్ డౌన్ అమలవుతున్నప్పటికీ దేశప్రజలను పట్టి పీడిస్తున్న ఆందోళన ఇది. ముఖ్యంగా అత్యవసర సేవలు అందిస్తున్న సిబ్బందితోపాటు, మందులు, కూరగాయలు, కిరాణా లాంటి అత్యవసర వస్తువులను విక్రయిస్తున్న దుకాణదారులను ఈ భయం వెంటాడుతోంది. అయితే కరోనా మహమ్మారి భయాలకు చెక్ పెడుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) రోపార్ ఒక కొత్త పరికరాన్ని రూపొందించింది. అతి తక్కువ ఖర్చుతో, అతి తక్కువ సమయంలో మనం వాడే నిత్యాసర సరుకులను ఈ వైరస్ బారినుంచి కాపాడుకోవచ్చని వెల్లడించింది.
* మహమ్మారి వైరస్‌పై పోరాటానికి ప్రభుత్వాలకు సాయంగా పలు సంస్ధలు, వ్యక్తులు తమకు తోచిన సాయం అందిస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో కోవిడ్-19పై పోరుకు తమ వంతు సాయంగా ఓలా గ్రూప్ గురువారం పీఎం కేర్స్ ఫండ్‌కు రూ 5 కోట్లు విరాళం అందచేసింది. పలు రాష్ట్రాల సీఎం సహాయ నిధులకు సైతం కంపెనీ రూ 3 కోట్ల విరాళం ప్రకటించింది.
* కోవిడ్-19 మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు లాక్‌డౌన్ అమలవుతున్న క్రమంలో పెన్షన్ ఫండ్ నుంచి 75 శాతం వరకూ విత్‌డ్రా చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించడంతో గత పదిరోజుల్లో సబ్‌స్ర్కైబర్లు రూ 280 కోట్లు వెనక్కితీసుకున్నారని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌ఓ) వెల్లడించింది. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన కింద ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన మేరకు 1.37 లక్షల మంది చందాదారులకు రూ 279.65 కోట్లు చెల్లించామని ఈపీఎఫ్‌ఓ పేర్కొంది.
* కరోనా వైరస్ వెలుగుచూసిన వుహాన్‌లో అశాంతి రగులుతోంది! ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. 80 రోజుల లాక్‌డౌన్ ఫలితంగా వుహాన్‌లో ఆర్థిక వ్యవస్థ దెబ్బతింది. ఈ నేపథ్యంలో అక్కడి ఓ అతిపెద్ద షాపింగ్ మాల్ గ్రాండ్ ఓషన్ డిపార్ట్‌మెంట్ స్టోర్ ముందు చిన్న దుకాణాదారులు నిరసన వ్యక్తం చేశారు. మాస్క్‌లు ధరించి ఒకరికొకరు కనీసం మీటరు దూరం కూర్చొన్నారు. ‘ఏడాది పాటు అద్దెను మినహాయించండి లేదా సెక్యూరిటీ డిపాజిట్ తిరిగిచ్చేయండి’ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. వీరిపై పోలీసులు నిఘా పెట్టారు.