ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈనెల 5న ధూల్‌పేటలో భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి.. ‘చైనీస్ వైరస్ గో బ్యాక్’ అంటూ చేసిన నినాదాలపై భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. భారత్‌లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కౌన్సిలర్(పార్లమెంట్) లియూ బింగ్… రాజాసింగ్‌కు లేఖ రాశారు. ‘‘కరోనా వైరస్ గురించి ప్రపంచానికి నివేదించిన తొలిదేశం చైనా. అంటే దీని అర్థం ఈ వైరస్ చైనా నుంచి ఉద్భవించిందని కాదు. చైనీస్ వైరస్ గో బ్యాక్ అని చేసిన నినాదాలను ఖండిస్తున్నాం’’ అన్నారు.దీనిపెనాౖ రాజాసింగ్ ప్రతిస్పందించారు. ‘అమెరికా అధ్యక్షుడు సైతం ఇది కరోనా వైరస్ కాదు.. చైనా వైరస్ అని పేర్కొన్న విషయం నిజంకాదా?’ అని ప్రశ్నించారు.
రాజా…చైనాకు చిర్రెత్తించాడు!
Related tags :