కరోనా చుట్టూ ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచమూ తిరుగుతున్నది. దానికి ఉదాహరణే ఈ నగలు. రష్యాకి చెందిన డాక్టర్ వోరోబియో ఈ లాకెట్టు సృష్టికర్త. అతను ఆరోగ్య, విజ్ఞాన రంగాలకు సంబంధించిన నమూనాలతో నగలు ఉత్పత్తి చేయడంలో దిట్ట. వైరస్ మైక్రోస్కోపిక్ చిత్రం ఆధారంగా ఓ లాకెట్టును తయారు చేశాడు. వెండితో చేసిన ఆ లాకెట్ ధర 1000 రూబెల్స్. ప్రపంచవ్యాప్తంగా దీన్ని 1000 మంది దాకా కొనుగోలు చేశారు. ఈ పెండెంట్‌ని డాక్టర్లు, నర్సులు.. ఇతర ఆరోగ్య కార్యకర్తల త్యాగాలకు గుర్తుగా రూపొందిస్తున్నట్లు వోరోబియో ప్రకటించాడు. అయితే కొంతమంది ప్రాణాంతక వైరస్‌ని ఇలా మెడలో అలంకరించుకోవడం ఏమిటని ఆక్షేపిస్తున్నారు. మరికొందరు దీన్ని ప్రేరణగా తీసుకొని కొత్త రూపాలతో పెండెంట్‌లు తయారు చేస్తున్నారు.
కరోనా వైరస్ ఫ్యాషన్
Related tags :