* ఈ నెల 14తో ముగియనున్న లాక్‌డౌన్ పొడిగింపు ఖాయంగా కనిపిప్తోంది. దీన్ని మరో రెండు వారాలపాటు పొడిగించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. లాక్‌డౌన్ పొడిగింపు, కరోనా కట్టడికి రాష్ట్రాలు చేపడుతున్న చర్యలపై ప్రధాని ఇవాళ ఉదయం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగింపే అన్ని సమస్యలకు పరిష్కారమని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి విన్నవించారు. రాష్ట్రాల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం లాక్‌డౌన్‌ను పొడిగింపునకు మొగ్గు చూపినట్లు సమాచారం. ఇప్పటికే ఒడిశా, పంజాబ్ రాష్ట్రాలు లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నాయి.
* రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్‌గా జస్టిస్ వి.కనగరాజ్‌మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ వి.కనగరాజ్‌దాదాపు తొమ్మిదేళ్లపాటు హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన వి.కనగరాజ్. స్టేట్‌ఎలక్షన్ కమిషనర్ హోదాలో రిటైర్డ్ హైకోర్టు జడ్జిని నియమించేలా ఆర్డినెన్స్‌ను తీసుకు వచ్చిన ప్రభుత్వం. ఆర్డినెన్స్ ప్రకారం జస్టిస్ వి.కనగరాజ్ నియామకం. విద్య, బాలలు, మహిళల, వృద్ధుల సంక్షేమ అంశాలకు సంబంధించి కీలక తీర్పులు ఇచ్చిన వి.కనగరాజ్.
* అమెరికాలో కరోనా వైరస్ సృష్టిస్తున్న మృత్యుఘోష అంతా ఇంతా కాదు. తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్‌లోనైతే పరిస్థితి మరీ దయనీయంగా మారింది. రోజు వందల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు ఆర్థిక రంగం పూర్తిగా స్తంభించిపోయింది. మరికొన్ని రోజులు ఇలాగే కొనసాగితే అనేక మంది ప్రజలు ఆకలితో అలమటించే దుస్థితి తలెత్తుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తరుణంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆంక్షల్ని ఎప్పుడు ఎత్తివేయాలన్నది సవాల్‌గా మారిందన్నారు. ఇప్పటి వరకు తన జీవితంలో తీసుకున్న నిర్ణయాల్లో ఇదే అతిపెద్ద నిర్ణయం కాబోతోందని వ్యాఖ్యానించారు.
* కొందరి అవివేకాన్ని ఏమనాలో అర్థం కావడం లేదు. పైగా సోషల్ మీడియా వ్యసనం ఒకటి. రక్షణ కోసం మాస్క్‌లు ధరించడాన్ని అవహేళన చేసిన ఓ వ్యక్తికి ఇప్పుడు కరోనా వైరస్ సోకింది. అతడి కారణంగా పోలీసులు, వైద్య సిబ్బంది, కుటుంబ సభ్యులు, సన్నిహితులు సహా దాదాపు 50 మందిని క్వారంటైన్‌కు తరలించాల్సి వచ్చింది. ఇప్పుడా వ్యక్తి బుందేల్‌ఖండ్ మెడికల్ కళాశాలలో ఐసోలేషన్‌లో ఉన్నాడు.
* అమెరికాలో భారత నేపథ్యం ఉన్న దాదాపు 40 మంది కరోనా వైరస్(కొవిడ్-19) బారిన పడి మరణించినట్లు అక్కడి భారతీయ సంఘాలు వెల్లడించాయి. వీరిలో కొంతమంది భారత పౌరసత్వం ఉన్నవారు కాగా.. మరికొంత మంది అక్కడే నివాసం ఏర్పరచుకున్న భారత సంతతివారని తెలిపాయి. మరో 1500 మంది వైరస్ బారినపడి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న న్యూయార్క్, న్యూజెర్సీ ప్రాంతాల్లోనే అత్యధిక మంది భారతీయులు నివసిస్తుండడం గమనార్హం.
* ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఈసీని ప్రభుత్వం మార్చడాన్ని మంత్రి మోపిదేవి సమర్థించారు. ఆయన్ను మారిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెదేపా అధినేత చంద్రబాబు కనుసన్నల్లో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పనిచేస్తున్నారనే అనుమానాలు వస్తున్నప్పుడు ఆయన్ను మార్చడంలో తప్పులేదన్నారు. రమేశ్ కుమార్ తొలగింపు విషయంలో విమర్శలు చేసేందుకు ప్రతిపక్షాలు తీసుకున్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుంటే బాగుండేదని ఆయన హితవు పలికారు. ప్రతిపక్షానికి చెప్పి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని మోపిదేవి స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో గంటల్లోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేయడం తగదని మోపిదేవి హితవుపలికారు.
* దేశంలో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ కరోనా నివారణపై దృష్టి పెడితే.. జగన్ ప్రభుత్వం మాత్రం అధికారులను ఎలా సస్పెండ్ చేయాలనే అంశంపై దృష్టి పెట్టిందని సీపీఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ప్రతిపక్షాల సూచనలు పరిగణనలోకి తీసుకోకపోగా, ప్రతిపక్షాలను రెచ్చగొట్టేలా అధికార పార్టీ నేతలు మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.
* ప్రధాని మోదీ పిలుపు మేరకు ఈనెల 5న ధూల్‌పేటలో భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ జ్యోతి ప్రజ్వలన చేసి.. ‘చైనీస్ వైరస్ గో బ్యాక్’ అంటూ చేసిన నినాదాలపై భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం స్పందించింది. భారత్‌లోని పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కౌన్సిలర్(పార్లమెంట్) లియూ బింగ్… రాజాసింగ్‌కు లేఖ రాశారు. ‘‘కరోనా వైరస్ గురించి ప్రపంచానికి నివేదించిన తొలిదేశం చైనా. అంటే దీని అర్థం ఈ వైరస్ చైనా నుంచి ఉద్భవించిందని కాదు. చైనీస్ వైరస్ గో బ్యాక్ అని చేసిన నినాదాలను ఖండిస్తున్నాం’’ అన్నారు.దీనిపెనాౖ రాజాసింగ్ ప్రతిస్పందించారు. ‘అమెరికా అధ్యక్షుడు సైతం ఇది కరోనా వైరస్ కాదు.. చైనా వైరస్ అని పేర్కొన్న విషయం నిజంకాదా?’ అని ప్రశ్నించారు.
* కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు లాక్‌డౌన్‌ను మరో రెండు వారాలు పొడిగించాలని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని మోదీని కోరారు. దేశవ్యాప్తంగా సీఎంలతో ప్రధాని వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కేసీఆర్ ఈ విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు లాక్‌డౌన్ బాగా ఉపయోగపడుతోందన్నారు. అందువల్ల దీన్ని కనీసం మరో రెండు వారాలు కొనసాగించడం మంచిదని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ఈ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇంతకుమించిన మార్గం లేదన్నారు.
* ఈ నెల 14తో ముగియనున్న లాక్‌డౌన్ పొడిగింపు ఖాయంగా కనిపిప్తోంది. దీన్ని మరో రెండు వారాలపాటు పొడిగించే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. లాక్‌డౌన్ పొడిగింపు, కరోనా కట్టడికి రాష్ట్రాలు చేపడుతున్న చర్యలపై ప్రధాని ఇవాళ ఉదయం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌డౌన్ పొడిగింపే అన్ని సమస్యలకు పరిష్కారమని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధానికి విన్నవించారు.
* ఆంధ్రప్రదేశ్‌లో రెడ్ జోన్ల వరకే లాక్‌డౌన్ పరిమితం చేయాలని ప్రధాని నరేంద్రమోదీకి ఏపీ సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలోని 676 మండలాల్లో 81 మండలాలను కరోనా ప్రభావిత మండలాలుగా గుర్తించామని జగన్ తెలిపారు. ఇందులో 37 రెడ్‌జోన్లు, 44 ఆరెంజ్ జోన్లు ఉన్నాయని చెప్పారు. 595 మండలాలు గ్రీన్ జోన్‌లో ఉన్నాయని తెలిపారు. కరోనా ప్రభావం ప్రస్తుతానికి గ్రీన్‌జోన్‌లో లేదన్నారు.
* ఒక్కసారి కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ వైరస్ సోకుతుందా? అప్పటికే శరీరంలో వృద్ధిచెందిన యాంటీబాడీలు ఆ ప్రభావాన్ని తగ్గిస్తాయా? వైరస్‌ను నిద్రాణ స్థితిలోనే ఉంచుతాయా? ఇతరులకు సోకినా ప్రమాదం ఉండదా? ప్రస్తుతం వైద్యులు, పరిశోధకులకు ఇలాంటి సందేహాలెన్నో ఉన్నాయి. అయితే దక్షిణ కొరియాలో కొవిడ్-19 నయమైందని భావించిన 91 మందికి పరీక్షల్లో మళ్లీ పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది. కరోనా నయమైన వారికి వైరస్ ఇతరుల నుంచి సోకుండా శరీరంలోనే తిరిగి చైతన్యమైందేమోనని భావిస్తున్నామని కొరియా వ్యాధుల నియంత్రణ (కేసీడీసీ) సంస్థ డైరెక్టర్ జియాంగ్ ఇయున్ క్యెయాంగ్ అంటున్నారు.
* కరోనా కట్టడికి ఏర్పాటు చేసిన నియంత్రణ ప్రదేశాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. స్వీయ నిర్బంధంలో ఉన్న వాళ్లను ‘టీఎస్‌కాప్’ యాప్‌తో అనుసంధానం చేసి.. ఆయా ఇళ్లను జియో ట్యాగ్ చేసినట్లు చెప్పారు. దీని ద్వారా స్వీయ నిర్బంధంలో ఉన్నవాళ్లు ఇల్లు దాటి బయటకు వస్తే సమీపంలోని పోలీసులకు సందేశం వెళ్తుందని డీజీపీ తెలిపారు. టీఎస్‌కాప్ యాప్ ఉన్న వాళ్లెవరైనా నియంత్రణ ప్రదేశాల వైపు వెళ్తే.. అనుమానితులు ఉన్న ఇళ్లకు కొంత దూరంలోపే అప్రమత్తం చేస్తుందన్నారు.
* ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా మరో 21 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు ఈ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 402కి చేరింది. గుంటూరులో 14, కర్నూలులో 5, ప్రకాశం, కడప జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున కొత్తగా నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో మొత్తం 909 మందికి కొవిడ్-19 పరీక్షలు నిర్వహించగా.. అందులో 37 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బులెటిన్‌లో వెల్లడించింది.
* ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఈసీని ప్రభుత్వం మార్చడాన్ని మంత్రి మోపిదేవి సమర్థించారు. ఆయన్ను మారిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెదేపా అధినేత చంద్రబాబు కనుసన్నల్లో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పనిచేస్తున్నారనే అనుమానాలు వస్తున్నప్పుడు ఆయన్ను మార్చడంలో తప్పులేదన్నారు. రమేశ్ కుమార్ తొలగింపు విషయంలో విమర్శలు చేసేందుకు ప్రతిపక్షాలు తీసుకున్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుంటే బాగుండేదని ఆయన హితవు పలికారు. ప్రతిపక్షానికి చెప్పి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని మోపిదేవి స్పష్టం చేశారు.
* కొవిడ్ 19 రోగుల నుంచి కరోనా వైరస్ 13 అడుగుల వరకు ప్రయాణించగలదని తాజా అధ్యయనం వెల్లడిచేస్తుంది. వారికి చికిత్స అందించిన ఆసుపత్రి వార్డుల్లోని గాలి నుంచి తీసుకున్న నమూనాలు పరిశీలించిన మీదట ఈ విషయం వెల్లడైందని పేర్కొంది. చైనా శాస్త్రవేత్తలు చేపట్టిన ఈ పరిశోధనలో ప్రాథమిక ఫలితాలు అమెరికాకు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(సీడీసీ) జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వ మార్గదర్శకాల్లో చెప్పిన దూరానికి వారు సూచించిన దూరం రెట్టింపుగా ఉంది.
* కరోనా వైరస్ పోరులో భాగంగా పీఎం కేర్స్ సహాయనిధికి ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు వర్తిస్తుందని ఆదాయపు పన్నుశాఖ ప్రకటించింది. ఈ నిధికి అందించే విరాళాలకు ఐటీ చట్టంలోని 80జీ కింద నూరు శాతం పన్ను మినహాయింపు ఉంటుందని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇలా తమ యాజమాన్యం ద్వారా ఉద్యోగులు ఇచ్చే విరాళాలకు ప్రత్యేకంగా ఎలాంటి ధృవపత్రాన్ని జారీచేయమని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ పేర్కొంది. అయితే యాజమాన్యం ఉద్యోగులకు సంవత్సరం చివరలో ఇచ్చే ఫారం-16లో విరాళం ఇచ్చిన మొత్తాన్ని చూపిస్తాయని తెలిపింది.
* ప్రపంచాన్ని తన గుప్పిట్లోకి తెచ్చుకుని విలయతాండవం చేస్తోన్న కరోనా వైరస్ రోజుకు వేల మందిని బలితీసుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటిదాకా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 16,98,271కి చేరగా మృతుల సంఖ్య లక్ష దాటింది. ఈ నేపథ్యంలో చాలా దేశాలు లాక్‌డౌన్ పాటిస్తున్నాయి. దీంతో భూమ్మీద సగం జనాభా ఇళ్లకే పరిమితమైంది. ఇక భారత్‌లోనూ కరోనా కేసులు అధికమవుతున్న తరుణంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని.. లేదంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని ఆ వైరస్ బారిన పడి కోలుకున్నవారు హెచ్చరిస్తున్నారు. కరోనా సోకితే పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయాలను వారు వివరిస్తున్నారు.