ఆంధ్రప్రదేశ్ ఎస్‌ఈసీని ప్రభుత్వం మార్చడాన్ని మంత్రి మోపిదేవి సమర్థించారు. ఆయన్ను మారిస్తే తప్పేంటని ప్రశ్నించారు. తెదేపా అధినేత చంద్రబాబు కనుసన్నల్లో నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పనిచేస్తున్నారనే అనుమానాలు వస్తున్నప్పుడు ఆయన్ను మార్చడంలో తప్పులేదన్నారు. రమేశ్ కుమార్ తొలగింపు విషయంలో విమర్శలు చేసేందుకు ప్రతిపక్షాలు తీసుకున్న శ్రద్ధ రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుంటే బాగుండేదని ఆయన హితవు పలికారు. ప్రతిపక్షానికి చెప్పి మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదని మోపిదేవి స్పష్టం చేశారు. కొన్ని సందర్భాల్లో గంటల్లోనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటువంటి సమయంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చిల్లర రాజకీయాలు చేయడం తగదని మోపిదేవి హితవుపలికారు.
మీకు అది ఎందుకు తప్పు?
Related tags :