పొడుగుకాళ్ల సుందరి శిల్పాశెట్టి నాజూకుదనంలో రెండు దశాబ్దాలుగా ఎలాంటి మార్పూ రాలేదంటే.. ఫిట్‌నెస్‌కు ఆమె ఎంత ప్రాధాన్యమిస్తుందో అర్థమవుతోంది. నలభైఅయిదేళ్లకు చేరువవుతున్నా పాతికేళ్ల యువతిలా కనిపించే ఈ సుందరి… రోజూ యోగా చేస్తూ చక్కని ఆహార నియమాలను పాటిస్తూ ఎంతోమందిలో స్ఫూర్తిని నింపుతోంది. సంప్రదాయ ఆహార రుచులను ఇష్టపడే శిల్ప తాజాగా తన ఫిట్‌నెస్ రహస్యం వెల్లడించింది. జొన్న రొట్టెలను తయారుచేసి వాటిని రాగికంచంలో తినడం తన ఫిట్‌నెస్‌కి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతోంది. ఆ వివరాలు ఓ వీడియోలో వివరించింది. మామూలుగా జొన్నరొట్టెల రుచి అదిరిపోతుంది. కొద్దిగా నువ్వులు కూడా కలిపితే ఇంకా రుచికరంగా ఉంటాయి. ఈ రొట్టెల్లో గ్లూటెన్ ఉండదు. పైగా బరువు తగ్గడానికి తోడ్పడతాయి. జొన్నలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ పిండితో రొట్టెలు మాత్రమే కాకుండా కేక్‌లు, ఇతర చిరుతిళ్లనూ చేసుకోవచ్చు అంటోంది శిల్ఫా
రాగి.రొట్టె.రహస్యం.
Related tags :