ScienceAndTech

కరోనా వచ్చి తగ్గింది..మళ్లీ వచ్చింది!

South Korean Researchers Shocked To See COVID19 Attacks Again

ఒక్కసారి కరోనా నుంచి కోలుకున్న వ్యక్తికి మళ్లీ వైరస్‌ సోకుతుందా? అప్పటికే శరీరంలో వృద్ధిచెందిన యాంటీబాడీలు ఆ ప్రభావాన్ని తగ్గిస్తాయా? వైరస్‌ను నిద్రాణ స్థితిలోనే ఉంచుతాయా? ఇతరులకు సోకినా ప్రమాదం ఉండదా? ప్రస్తుతం వైద్యులు, పరిశోధకులకు ఇలాంటి సందేహాలెన్నో ఉన్నాయి. అయితే దక్షిణ కొరియాలో కొవిడ్‌-19 నయమైందని భావించిన 91 మందికి పరీక్షల్లో మళ్లీ పాజిటివ్‌ రావడం కలకలం సృష్టిస్తోంది. కరోనా నయమైన వారికి వైరస్‌ ఇతరుల నుంచి సోకుండా శరీరంలోనే తిరిగి చైతన్యమైందేమోనని భావిస్తున్నామని కొరియా వ్యాధుల నియంత్రణ (కేసీడీసీ) సంస్థ డైరెక్టర్‌ జియాంగ్‌ ఇయున్‌ క్యెయాంగ్‌ అంటున్నారు. ఇలా ఎందుకు జరుగుతోందో అర్థంకావడం లేదన్నారు. వైద్యులు, శాస్త్రవేత్తలు పరిశోధనలు చేస్తున్నారని వివరించారు. ఒక్కసారి కొవిడ్‌ సోకినవారిలో యాంటీబాడీలు పెరిగి సంబంధిత రోగనిరోధక శక్తి పెరుగుతుందని ఇంతకాలం భావించారు. వైరస్‌ మళ్లీ దాడిచేస్తుండటంతో అందరిలోనూ ఆందోళన మొదలైంది. దక్షిణ కొరియాలో రెండోసారి కొవిడ్‌ సోకిన వారి సంఖ్య సోమవారం 51గా ఉండగా ఇప్పుడు 91కి చేరుకుంది. ఆ దేశంలో దాదాపుగా 7000 మంది కరోనా నుంచి కోలుకున్న సంగతి తెలిసిందే. ‘రెండో సారి సోకినవారి సంఖ్య పెరుగుతోంది. 91 అనేది ఇప్పుడే మొదలైందనడానికి నిదర్శనం’ అని కొరియన్‌ యూనివర్సిటీ గురో ఆస్పత్రిలో అంటువ్యాధుల ప్రొఫెసర్‌ కిమ్‌ వూ జూ అన్నారు. బహుశా వైరస్‌ తిరిగి చైతన్యమైందేమోనని భావిస్తున్నానని తెలిపారు