NRI-NRT

తానా సహకారంతో కర్నూలులో మాస్క్‌ల పంపిణీ

TANA Secretary Ravi Potluri Donates 1000 Masks To Kurnool City

తానా సహకారంతో కర్నూల్ లో వెయ్యి మందికి మాస్కులు పంపిణీ. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ప్రధానమైనది మాస్కులు ధరించడం. మాస్కులు ధరించడం ద్వారా కరోనాను చాలా వరకు కట్టడి చేయవచ్చని వైద్యులు చెబుతున్నారు అటువంటి మాస్కులు ఇవ్వడం ద్వారా తనవంతుగా కొందరికైనా సహకరించినట్లు గా అవుతుంది అనే ఆలోచనతో ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కార్యదర్శి రవి పొట్లూరి సహకారంతో శనివారం (ఏప్రిల్ 11) కర్నూలు పట్టణ కమిషనర్ రవీంద్ర బాబు చేతుల మీదుగా కర్నూల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగులకు వెయ్యి మాస్కులు పంపిణీ చేయించారు. ఈ కార్యక్రమంలో ముప్పా రాజశేఖర్, సీఐ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. బాలాజీ కాంటీన్స్ ద్వారా మార్చ్ 31 నుండి ప్రతి రోజు వెయ్యు మందికి పైగా పోలీసులకు, పారిశుధ్య కార్మికులకు ఆహారం అందజేస్తున్నామని, తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్, మాజీ అధ్యక్షులు సతీష్ వేమన, ఫౌండేషన్ చైర్మన్ నిరంజన్ శృంగవరపు సహకారంతో జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో కూడా మాస్కుల పంపిణీ జరుగుతుందని ముప్పా రాజశేఖర్ తెలిపారు.

TANA Secretary Potluri Ravi | Telugu News updates