కరోనా ఎఫెక్ట్.. ముందు జాగ్రత్త.. మేకలకు మాస్కులు..! కరోనా.. ఈ పేరు వింటే చాలు.. ప్రపంచ దేశాలన్నీ గజగజవణికిపోతున్నాయి. ఈ వైరస్ అంతలా భయపెడుతోంది. దీనికి వ్యాక్సిన్ లేకపోవడంతో.. ఈ మహమ్మారి విజృంభిస్తోంది. ఇప్పటికే దీని దెబ్బకు 75 వేల మంది ప్రాణాలు కోల్పోగా.. 13 లక్షల మంది ఆస్పత్రిపాలయ్యారు. ఇక మనదేశంలో ఐదువేల మందికి పైగా పాజిటివ్ కేసులతో ఆస్పత్రి పాలవ్వగా.. వందమందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఇక ఇప్పటి వరకు ఇది మనుషులకే సోకుతుందనుకుంటే.. తాజాగా.. అమెరికాలోని ఓ పులికి కూడా కరోనా పాజిటివ్ తేలడంతో.. ప్రపంచమంతా షాక్‌కు గురయ్యింది. ఈ వైరస్ జంతువులపై కూడా పగబట్టిందని తెలిసిపోయింది. దీంతో పెంపుడు జంతువులు పెంచుకునే వారంతా అప్రమత్తమయ్యారు. ఈ క్రమంలో మన తెలంగాణ జిల్లాలో ఓ మేకల కాపరి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తన పెంపుడు మేకలకు మాస్క్‌లు కట్టాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది. కల్లూరు మండలం పేరువంచ ఎన్టీఆర్ కాలనీకి లో జరిగింది..
మేకలకు కరోనా మాస్క్‌లు
Related tags :