లాక్ డౌన్ కారణంగా అందరికీ వీలైనంత ఖాళీ సమయం దొరుకుతోంది. షూటింగ్లు, ప్రమోషన్లు లేకపోవడంతో సినిమా స్టార్స్ కూడా ఇంట్లోనే ఉండిపోయారు. ఈ సమయంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి, ప్రయోగాలు చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. కాజల్ కూడా వంట గదిలోకి వెళ్లి సమోసాలు తయారు చేశారు. బాగా రావడంతో శబాష్ అనేసుకున్నారు కూడా. ‘‘తొలిసారి సమోసా చేశాను. చాలా బాగా కుదిరింది. మా అమ్మ ఆధ్వర్యంలో చాలా శుభ్రతను, క్వాలిటీని పాటిస్తూ తయారు చేశాను’’ అని పేర్కొన్నారు కాజల్.
కాజల్ సమోసాలు
Related tags :