* కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించింది. పొగాకు, ఖైనీ తదితర ఉత్పత్తులను బహిరంగంగా నమలడం, ఉమ్మివేయడాన్ని నిషేధించాలన్న కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిషేదాజ్ఞలు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం వల్ల కరోనా వైరస్ మరింత వ్యాప్తి చెందుతుందని.. దీన్ని నిషేధించేలా చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర ప్రభుత్వానికి ఐసీఎంఆర్ లేఖ రాసింది. దీంతో బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.
* మానవాళికే సవాల్ విసురుతున్న కరోనా వైరస్‌ను కట్టడిచేసేందుకు అన్ని దేశాలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ వైరస్‌ను వ్యాప్తిని అరికట్టడంలో అసలు దీన్ని గుర్తించడమే అత్యంత కీలకం. దీనికోసం కరోనా వైరస్ లక్షణాలున్న వ్యక్తులతోపాటు అనుమానితులకు కూడా కొవిడ్-19 నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని సమయాల్లో వైరస్ ఉన్నవ్యక్తుల్లో లక్షణాలు బయటపడకపోవడం చూశాం. తాజాగా వైరస్ ఉన్న వ్యక్తులకు నిర్ధారణ పరీక్ష నిర్వహించగా ఫలితం నెగిటివ్ వచ్చే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇలాంటి పరిణామంతో వైరస్ తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీనికి ప్రస్తుతం అనుసరిస్తున్న కొవిడ్ నిర్ధారణ పరీక్ష విధానం ఒక కారణంగా విశ్లేషిస్తున్నారు.
* ఏప్రిల్ 14. ప్రధాని చెప్పిన 21 రోజుల లాక్‌డౌన్ గడువు ముగియబోయే రోజు. కరోనా వైరస్ కట్టడికి కేంద్రం తీసుకున్న కఠినమైన ఈ నిర్ణయానికి ఈ పాటికే ఫలితం వచ్చి ఉండాలి. దురదృష్టవశాత్తూ కేసులు తీవ్రత తగ్గాల్సింది పోయి కొత్త కేసులు వెలుగు చూడడం ప్రారంభమైంది. దీంతో ఇప్పుడు మరోసారి లాక్‌డౌన్ అంశం తెరపైకి వచ్చింది. ఓ వైపు పెరుగుతున్న కరోనా కేసులు.. మరోవైపు దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ.. రెండింటికీ సమన్యాయం చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ ఉంటుందా? ఉంటే ఎలా ఉండబోతోంది? ఏమైనా మినహాయింపులుంటాయా?
* కరోనా వ్యాప్తి నేపథ్యంలో తెలంగాణలో ప్రవేశ పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వాయిదా వేసింది. ఎంసెట్ సహా మే నెలలో జరగాల్సిన ప్రవేశ పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి కొత్త తేదీలను ప్రకటిస్తామని ఉన్నత విద్యామండలి ఛైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. ప్రవేశ పరీక్షల దరఖాస్తులకు మే 5 వరకు గడువు ఉన్నట్లు ఆయన చెప్పారు.
* రాష్ట్రంలోని అందరికీ మాస్కులు ఉచితంగా పంపిణీ చేయాలని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కొవిడ్ నివారణ చర్యలపై ఆదివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రతి వ్యక్తికి మూడు మాస్కులు చొప్పున మొత్తం 16కోట్ల మాస్కులు పంపిణీ చేయాలని ఆదేశించారు. హైరిస్కు ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
* కరోనా మహమ్మారి కట్టడికి దేశమంతా ఒకేతాటిపై నడుస్తోంది. సామాజిక దూరం పాటిస్తూ ప్రజలంతా ఇళ్లలోనే ఉంటున్నారు. అత్యవసరాల కోసం బయటికి వచ్చినప్పటికీ.. జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దుకాణాల వద్ద కూడా కొన్ని మీటర్ల దూరం పాటిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొందరు నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఓ ఫొటో మంత్రి కేటీఆర్ మనసును ఆకట్టుకుంది. ఓ దుకాణానికి వెళ్లిన ఐదుగురు చిన్నారులు అక్కడ గీసిన బాక్సుల్లో నిల్చున్నారు. లోకం తెలియని వీరు కూడా సామాజిక దూరం పాటించడంతో ఈ ఫొటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
* కరోనా కట్టడికి లాక్‌డౌన్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఓ వైపు అధికారులు, ప్రభుత్వాలు హెచ్చరిస్తున్నా.. వాటిని పలువురు ఉల్లంఘిస్తూనే ఉన్నారు. పలుచోట్ల పోలీసులపై దాడికి కూడా పాల్పడుతున్నారు. పంజాబ్‌లో అయితే ఏకంగా విధి నిర్వహణలో ఉన్న పోలీసు చేతినే నరికేశారు దుండగులు. ఓ వర్గం వ్యక్తులు పోలీసులపై దాడికి దిగి ఈ దారుణానికి పాల్పడ్డారు. పటియాలాలోని కూరగాయల మార్కెట్ సమీపంలో ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగింది.
* ప్రపంచదేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ ప్రభావం భారత్‌లోనూ కొనసాగుతోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రభుత్వానికి అండగా ఉండేందుకు సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు తమవంతు సాయం చేస్తున్నారు. ముఖ్యంగా సినీతారలు కరోనాపై జరిగే పోరాటంలో సామాజిక మాధ్యమాల వేదికగా ప్రజలకు అవగాహన కల్పిస్తూ అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు. ఇటీవల అన్ని చిత్ర పరిశ్రమలకు సంబంధించిన అగ్ర నటులు ‘ఫ్యామిలీ’ అనే షార్ట్‌ఫిల్మ్‌లో నటించిన సంగతి తెలిసిందే. ప్రసూన్ పాండే దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు బుల్లితెర నటులందరూ కలిసి ఓ షార్ట్ ఫిల్మ్ చేశారు. వీరంతా తమ ఇంట్లో ఉంటూనే ఈ షార్ట్‌ఫిల్మ్‌లో నటించడం మరో విశేషం.
* భారత్‌లో వివిధ ప్రాంతాల నుంచి స్వస్థలాలకు తిరిగెళ్తున్న వలస కూలీల వల్ల కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. వీరంతా వైరస్ వాహకులుగా మారి ఆయా గ్రామాల్లో వ్యాప్తి చేసే అవకాశం ఉందని తెలిపింది. ప్రాథమిక అధ్యయనాల ప్రకారం వీరంతా వలస వెళ్లిన ప్రాంతాల్లో ఇప్పటికే వైరస్ పాకి ఉంటుందని తెలుస్తోందన్నారు. అత్యంత జన సాంద్రత కలిగిన దక్షిణాసియా దేశాల్లోని నగరాల్లో కరోనా సామాజిక వ్యాప్తిని అడ్డుకోవడం ఓ సవాల్‌తో కూడుకున్న అంశమని అభిప్రాయపడింది.
* టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత గౌరవంగా రిటైర్మెంట్ ప్రకటించాల్సిందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అభిప్రాయపడ్డాడు. రిటైర్మెంట్ విషయంలో అతనలా ఎందుకు జాప్యం చేస్తున్నాడో తనకు ఇప్పటికీ అర్థమవ్వట్లేదని చెప్పాడు. తాజాగా పీటీఐతో మాట్లాడిన అక్తర్ భారత జట్టుకు ధోనీ ఎంతో సేవ చేశాడని పేర్కొన్నాడు. ‘తనకు చేతనైనంత మేరకు ధోనీ టీమ్‌ఇండియాకు సేవ చేశాడు. అతను గర్వంగా ఆటకు వీడ్కోలు పలకాలి. ఈ విషయంలో అతనెందుకు జాప్యం చేస్తున్నాడో నాకు అర్థంకావడం లేదు. గతేడాది వన్డే ప్రపంచకప్ తర్వాత ఆట నుంచి తప్పుకోవాల్సింది’ అని అన్నాడు.