గర్భిణీలు ఆందోళన చెందకుండా ఆనందంగా ఉంటే పిల్లలూ శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉంటారనేది తెలిసిందే. అంతేకాదు, వాళ్లిద్దరిమధ్యా చక్కని అవగాహన, సమన్వయం ఉంటాయనీ ఇద్దరూ ఒకేలా ఆలోచిస్తారనీ కూడా చెబుతున్నారు కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. ఎలక్ట్రో ఎనసెఫలోగ్రఫీలో పరిశీలించినప్పుడు- తల్లీ బిడ్డల మధ్య మెదడు సంకేతాలు అనుసంధానమై పనిచేయడం గుర్తించారు. అంటే- వాళ్లిద్దరి మధ్యా ఉన్న నాడుల అనుసంధానం కారణంగా ఇద్దరి ఆలోచనా విధానం ఒకేలా ఉంటుందట. అంతేకాదు, తల్లీబిడ్డలిద్దరూ కలిసి ఆనందంగా గడిపే ఆ సమయం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిదట. దానివల్ల పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారట. అంతేకాదు, పుట్టిన తరవాత కూడా పిల్లలు తల్లుల నుంచే నేర్చుకోవడానికి ఇష్టపడతారని చెబుతున్నారు. అదే తల్లి డిప్రెషన్, ఆందోళనలతో బాధపడుతుంటే వాళ్లిద్దరి మధ్యా నాడీకణాల అనుసంధానం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అలాంటి తల్లులకీ పిల్లలకీ మధ్య అవగాహన తక్కువగా ఉండటంతోబాటు వాళ్ల నుంచి నేర్చుకోవడానికి కూడా పిల్లలు పెద్దగా ఇష్టపడరని చెబుతున్నారు. ఆ కారణం వల్లే తల్లి ఆనందంగా ఉండే కుటుంబాల్లోని పిల్లలు, పెరిగే దశలో ఉపాధ్యాయులూ మిగిలినవాళ్లూ చెప్పిన దానికన్నా తల్లి చెబితేనే బాగా అర్థం చేసుకుంటారు, వింటారు కూడా అంటున్నారు నిపుణులు.
గర్భవతుల ఒత్తిడి పిల్లలపై ఉంటుంది
Related tags :