?వ్యవసాయ మంత్రిత్వ శాఖ ?
✨ ✨లాక్‌డౌన్ సమయంలో వ్యవసాయం, అనుబంధ రంగాలను ప్రోత్సహించేలా దేశంలో వివిధ చర్యలు చేపట్టిన వ్యవసాయ, సహకారం, రైతు సంక్షేమ శాఖ
– లాక్‌డౌన్ కాలంలో క్రాప్ సాఫ్ట్‌వేర్ ఉపయోగించి 1.25 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ రసాయనాల దిగుమతులకు 33 అనుమతులు జారీ చేసిన సీఐబీ అండ్ ఆర్‌సీ
– ఏపీఈడీఏ ద్వారా రవాణా, కర్ఫ్యూ పాస్లు మరియు ప్యాకేజింగ్ యూనిట్లకు సంబంధించిన సమస్యల పరిష్కారం
– బియ్యం, వేరుశనగ, ప్రాసెస్ చేసిన ఆహారం, మాంసం, పౌల్ట్రీ, పాలు, సేంద్రీయ ఉత్పత్తులతో సహా అన్ని ప్రధాన ఉత్పత్తుల ఎగుమతులు ప్రారంభం ✨✨
లాక్‌డౌన్ సమయంలో క్షేత్రస్థాయిలో రైతులకు సౌలభ్యంగా ఉండేలా మరియు వ్యవసాయ కార్యకలాపాలను సులభతరం చేయడానికి కేంద్రం వ్యవసాయ సహకారం మరియు రైతు సంక్షేమ శాఖ వివిధ చర్యలను చేపడుతోంది. లాక్‌డౌన్ వేళ కేంద్ర క్రిమిసంహారక మండలి & రిజిస్ట్రేషన్ కమిటీ (సీఐబీ & ఆర్‌సీ) తన క్రాప్ సాఫ్ట్‌వేర్‌ను గరిష్ట స్థాయిలో ఉపయోగించే ప్రయత్నాలు చేస్తోంది. సంస్థలోని నిపుణులు, అధికారులు తమ ఇంటి నుండి వర్క్‌ఫ్రం హోం విధానంలో ధ్రువపత్రాలు జారీ చేయడానికి వీలుగా వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ను(వీపీఎన్) వినియోగిస్తోంది.
సస్య సంరక్షణ రసాయనాలు, పంటలు మేటిగా పండేందుకు ఉపయోగపడే రసాయనాల ఉత్పత్తి యూనిట్లు, ప్లాంట్‌లు సజావుగా పనిచేయడానికి అవసరమయ్యే ధ్రువప్రతాలను ఈ డిజిటల్ వేదికపై జారీ చేస్తున్నారు. స్వదేశంలో పంట రసాయనాలు, ఇంటర్‌మీడియట్స్, తగిన ముడి పదార్థాల దిగుమతికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ల జారీకి గాను ఈ ప్రయత్నం గణనీయంగా దోహద పడుతోంది. దేశంలో రైతులకు సకాలంలో క్రిమి సంహారక మందులు, సస్య సంరక్షణ మందులు అందుబాటులో ఉండేలా సీఐబీ & ఆర్‌సీ అన్ని వివిధ మార్గాలలో పలు చర్యలను చేపడుతోంది. వేగంగా ఆన్‌లైన్‌లో అనుమతులు..
-లాక్‌డౌన్ వేళ 1.25 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా వివిధ పంట రసాయనాలను దిగుమతికి వీలుగా సీఐబీ & ఆర్‌సీ ఇప్పటి వరకు 33 దిగుమతి అనుమతులను జారీ చేసింది. దీనికి తోడు
పురుగు మందుల ఎగుమతిని సులభతరం చేయడానికి ఎగుమతులకు దాదాపు 189 ధ్రువీకరణ పత్రాలను జారీ చేసింది. పురుగు మందుల స్వదేశీ తయారీని సులభతరం చేసేలా వివిధ విభాగాలలో 1263 ధ్రువ పత్రాలు జారీ చేసింది.