శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో శనివారం సాయంత్రం పుష్పయాగం ఏకాంతంగా నిర్వహించారు.ఆలయం లోని రంగనాయక మండపంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులకు శాస్త్రోక్తంగా యాగం నిర్వహించారు.750 కిలోల నుంచి టన్ను వరకు రోజా, చామంతి, సంపంగి, కనకాంబరంతో పాటు వివిధ రకాల పుష్పాలు, తులసి ఇతర పత్రాలు ఈ యాగం లో ఉపయోగించారు.సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు జరిగిన యాగంలో డిప్యూటీ ఈ ఓ శ్రీ లోకనాథం, గార్డెన్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసు లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఒంటిమిట్టలో ముగిసిన పుష్పయాగం

Related tags :