పెండ్లి అంటేనే ఒక పండగ. బట్టలు, నగలు, సరదాలు, సంతోషాలు…అన్నీ అందులో భాగాలే. అయితే బట్టలు,ఇతర విషయాల మీద ఉన్న శ్రద్ధ నగల మీద కనిపించదు. అసలు అవి నప్పుతాయో లేదో కూడా చూసుకోకుండా కొనేస్తారు. అందులోనూ ముఖ్యంగా పాపిట బిళ్ల. ఏదో ఒకటి అని కాకుండా మీ ముఖాకృతికి సరిపోయే మాంగ్ టిక్కా ఎలా ఎంచుకోవాలో చదువండి…అందరి దృష్టి ఆకర్షించడంలో నగలు ముందుంటాయనేది నలుగురూ ఒప్పుకొనే వాస్తవం. అయితే మెడలో అలంకరించుకునే నగలపై ఎంతోకొంత శ్రద్ధ చూపినా… నుదుటన పెట్టే పాపిట బిళ్లను మాత్రం పెద్దగా పట్టించుకోరు. కానీ అదే ముఖాన్ని మరింత అందంగా చూపెడుతుందనే విషయాన్ని మరచిపోతున్నారు. ముందు మీ ముఖాకృతి ఏంటో తెలుసుకోండి. దానికి తగ్గట్లు ఏ మాంగ్ టిక్కా మీకు సూటవుతుందో నిర్ణయించుకోండి.గుండ్రటి ముఖాకృతి ఉన్నవారు పెద్ద పెద్ద డిజైన్ల జోలికి వెళ్లకూడదు. ముఖం చిన్నగా ఉన్నప్పుడు పాపిట బిళ్ల చిన్నదే ఎంచుకోవాలి. ముత్యాలు, చిన్న లాకెట్టు లేదా సొగసైన ట్రింకెట్లను కలిగి ఉన్న మాంగ్ టిక్కా అయితే వీరికి నప్పుతుంది. డైమండ్ ఆకృతిలోని పాపిట బిళ్ల కూడా బాగుంటుంది.చతురస్రాకారపు ముఖం ఉన్నవాళ్ల నుదురు పెద్దగా ఉంటుంది. కాబట్టి ఇది కవర్ అయ్యే పాపిట బిళ్లనే ఎంచుకోవాలి. గుండ్రటి లాకెట్ ఉండి దాని చివర ముత్యాలు వేలాడేలా ఉన్న మాంగ్ టిక్కా ఉత్తమం.దీర్ఘచతురస్రాకార ముఖం ఉన్న వారి నుదురు కూడా విశాలంగా ఉంటుంది. వీళ్లు కూడా పెద్ద లాకెట్ ఉన్న పాపిట బిళ్లను ఎంచుకోవాలి. అది కూడా గుండ్రంగా ఉండాలి. కుందన్ డ్రాప్స్, ముత్యాలు, పూసలు వచ్చేలా చూసుకోవాలి.మొహం కోడిగుడ్డు ఆకారంలో ఉన్నవారికి ఎలాంటి పాపిట చెయిన్లయినా బాగుంటాయి. జుట్టును వైవిధ్యంగా ముడి వేసుకొని ఏ పాపిట బిళ్లనైనా వీరు పెట్టుకోవచ్చు. కొప్పు వేసి పాపిట బిళ్ల పెడితే, అందం రెట్టింపవడం ఖాయం. డైమండ్ ఆకృతి ఉన్నవాళ్లు మరీ గాడీ డిజైన్లు కాకుండా సింపుల్‌గా ఉన్నవాటిని ఎంచుకోవాలి. చిన్న డ్రాప్ వచ్చిన మాంగ్ టిక్కానో, దానికి చిన్న పూస ఒకటి
వేలాడే పాపిట బిళ్లనో ఎంచుకోవచ్చు. ఈ విషయంలో ఎక్కువ ప్రయోగాలు చేయొద్దు. హృదయాకార ముఖం ఉన్నవారికి సంప్రదాయ జువెలరీ బాగా సూటవుతుంది. కుందన్ హెవీగా ఉండే పాపిట బిళ్లలు ఎంచుకోవచ్చు. కాకపోతే, కింద డ్రాప్ చిన్నగా ఉండేలా చూసుకుంటే సరిపోతుంది.పొడవైన ముఖాకృతి ఉన్నవాళ్లు.. నుదురు మొత్తం కవర్ అయ్యేలా ఉండే మాంగ్ టిక్కాను ఎంచుకోవాలి. వివిధ రకాల షేప్స్‌తో వచ్చే పాపిట చెయిన్‌తో మీరు ప్రయోగాలు చేయొచ్చు. ఈ పొడవాటి ముఖం ఉన్నవాళ్లకు కాస్త ముత్యాలు వేలాడే మాంగ్ టిక్కాలు బాగుంటాయి. ఆలస్యమెందుకు…అద్దం ముందుకు వెళ్లిపోండి.
ముఖాకృతికి సరితూగే పాపిట చెయిన్
Related tags :