పండ్లూ కూరగాయల్ని తినడంవల్ల ఆరోగ్యంగా ఉంటామనేది తెలిసిందే. అయితే వీటితో మెనోపాజ్ లక్షణాలకీ దూరంగా ఉండొచ్చు అంటోంది నార్త్ అమెరికన్ మెనోపాజ్ సొసైటీ. ముఖ్యంగా రోజుకో ఆపిల్ తింటే హార్మోనల్ చికిత్సతో పని ఉండదు అంటున్నారు. ఎందుకంటే కొందరు మహిళల్లో ఈస్ట్రోజెన్ శాతం తగ్గిపోవడంతో కుంగుబాటు, చిరాకు, తలనొప్పి… వంటి పలు సమస్యలు తీవ్రంగా బాధిస్తుంటాయి. ఆ బాధ భరించలేక కొందరు హార్మోనల్ చికిత్స చేయించుకుంటారు. కానీ అది అవసరం లేదనీ ఆహారం, జీవక్రియా లోపాలే ఈస్ట్రోజెన్ సమస్యకి ప్రధాన కారణమని తేల్చి చెబుతున్నారు పరిశోధకులు. ముఖ్యంగా పండ్లూ కూరగాయలు, ముడిధాన్యాలూ డ్రైనట్సూ ఎక్కువగా ఉండే మెడిటేర్రేరియన్ డైట్ తీసుకునేవాళ్లలో మెనోపాజ్ లక్షణాలు తక్కువగా ఉన్నాయని వారు విశ్లేషిస్తున్నారు. అందులోనూ ఆకుకూరలూ పసుపురంగు పండ్లూ క్రమం తప్పకుండా తీసుకునే వాళ్లలో ఈస్ట్రోజెన్ సమస్య మరీ తక్కువగా ఉందట. కాబట్టి అన్ని రకాల పండ్లూ కూరగాయలు తినడంతోబాటు వీటిని తప్పకుండా తినమనేది వాళ్ల సూచన.
మెనోపాజ్ నుండి రక్షించే ఆహారం

Related tags :