ప్రపంచవ్యాప్తంగా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో అమెరికా, భారత పరిస్థితులను పోల్చుతూ న్యూయార్క్ నగరంలో నివసిస్తున్న భారత్‌కు చెందిన ఓ యువతి రూపొందించిన వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియోపై పలు వర్గాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో ఆమె క్షమాపణ చెప్పారు. ఇరు దేశాల పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవని.. జీవినవిధానాలు వేరని.. అలా పోల్చడం ఏమాత్రం సరికాదని అభిప్రాయపడ్డారు. తన వ్యాఖ్యలు అమెరికాలో ఉన్న భారతీయ సమాజానికి బాధ కలిగించినట్లు తన దృష్టికి వచ్చిందని తెలిపారు. అందుకు క్షమాపణలు చెబుతున్నానన్నారు. ఓ ప్రైవేట్ యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన స్క్రిప్టును మాత్రమే తాను చదివానని.. అవి తన వ్యక్తిగత అభిప్రాయాలు కావని స్పష్టం చేశారు. అయినా, తన వీడియోకు తానే బాధ్యతవహిస్తూ క్షమాపణలు కోరుతున్నానన్నారు. మాతృదేశంతో పాటు ఆశ్రయం కల్పించిన దేశం కూడా గొప్పదేనని అభిప్రాయపడ్డారు. ఏదేశాన్నీ తక్కువ చేసి మాట్లాడే ఉద్దేశం తనకు లేదన్నారు.
పౌరసమాజానికి స్వాతి క్షమాపణలు
Related tags :