ఎటువంటి లాభాపేక్ష లేకుండా తన స్నేహితురాలైన డిజైనర్ అనితారెడ్డితో కలిసి ప్రజలకు అవసరమైన మాస్క్‌లు తయారు చేయిస్తున్నట్టు కథానాయిక లావణ్యా త్రిపాఠీ చెప్పారు. తమకు అవసరమైన అనుమతులు లభిస్తే వైద్య సిబ్బందికి అవసరమైన ‘ఎన్95’ మాస్క్‌లు తయారు చేయించడానికి తాము సిద్ధంగా ఉన్నామని ఆమె తెలిపారు. లావణ్యా త్రిపాఠీ మాట్లాడుతూ ‘‘చాలామంది సీనియర్ డాక్టర్లను సంప్రదించిన తర్వాత కాటన్‌తో మాస్క్‌లు తయారు చేశాం. మొదట రోజుకి 50 మాస్క్‌లు రెడీ చేశాం. డిమాండ్‌ని బట్టి ప్రొడక్షన్ పెంచాం. ఎంతో సేవ చేస్తున్న వైద్య సిబ్బందికీ మాస్క్‌లు ఇవ్వాలనుంది. అనుమతులు వస్తే ఆ పనీ చేస్తాం. సంక్షోభ సమయంలో వాళ్లకు మన చేతనైనంత మద్దతు ఇవ్వడం ఎంతైనా అవసరం. మాస్క్‌లు తయారు చేయడం వెనుక మా ముఖ్య ఉద్దేశం, మాస్క్‌లు ఆవశ్యకతపై ప్రజల్లో అవగాహన పెంపొందించడమే. కాటన్ మాస్క్‌లు అమ్మడం ద్వారా వచ్చిన డబ్బును తయారు చేస్తున్న వాళ్లకే ఇస్తున్నాం’’ అన్నారు.
అనుమతిస్తే మాస్క్‌లు తయారు చేస్తాం

Related tags :