Business

ఇంటి ముందు కరెన్సీ నోట్లు ప్రత్యక్షం

Bihar Guy Leaves Currency Notes In Front Of People's Doors

లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశవ్యాప్తంగా పలు విచిత్ర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. బిహార్‌లోని ఓ పట్టణంలో ఇళ్ల ముందు కరెన్సీ నోట్లు దర్శనమిస్తుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. సహస్ర పట్టణంలో ఓ అగంతకుడు పలు ఇంటి గుమ్మాల ముందు కరెన్సీ నోట్లు ఉంచుతున్నాడు. వాటితో పాటు ఓ చీటీలో ‘నేను కరోనాతో వచ్చాను. ఈ నోటును స్వీకరించండి, లేకుంటే ప్రతిఒక్కరినీ వేధిస్తాను’ అని అందులో రాశాడు. ఇళ్ల ముందు రూ.20, రూ.50, రూ.100 నోట్లు లభ్యమవుతున్నాయి. గత శుక్రవారం నుంచి ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు ముగ్గురు ఇంటి యజమానులు తమ ఇంటిముందు కరెన్సీ నోట్లు దొరికినట్లు పోలీసులకు తెలిపారు. చీటీల్లోని చేతిరాతను బట్టి ఒకే వ్యక్తి ఈ పనిచేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే కేవలం ఆటపట్టించడానికి ఆ వ్యక్తి ఇలా చేస్తుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.