పదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి వేడుకలను జరుపుకోవడం ఓ గొప్ప అనుభూతి అని ఒకప్పటి అందాలతార రంభ అన్నారు. కరోనా కల్లోలం దేశవ్యాప్తంగా రోజురోజుకీ విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆ మహమ్మారి కట్టడి కోసం ప్రజలందరూ ఇళ్లకే పరిమితమవ్వాలని కేంద్రప్రభుత్వం లాక్‌డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రంభ దంపతులు తమ పిల్లలతో కలిసి నివాసంలోనే వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో, ఫొటోలను ఫేస్‌బుక్ వేదికగా నెటిజన్లతో ఆమె పంచుకున్నారు.‘ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్లిష్ట పరిస్థితుల నేపథ్యంలో స్నేహితులు, బంధువులు ఎవరూ లేకుండా నేను, నా భర్త.. మా చిన్నారులతో ఇంట్లోనే వివాహ వార్షికోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇప్పటివరకూ జరుపుకున్న ఫంక్షన్స్ అన్నింటికంటే ఇది బెస్ట్ ఫంక్షన్. ఎందుకంటే ఈ సెలబ్రేషన్స్ మాకు వ్యక్తిగతం ఎన్నో మధురానుభూతులను దగ్గర చేసింది. ఒకరికొకరం సాయం చేసుకుంటూ సెలబ్రేషన్స్ కోసం మేమే అన్ని సిద్ధం చేసుకున్నాం. కేక్‌ను ఆర్డర్ చేయకుండా మేమే ఇంట్లోనే తయారు చేశాం. ఈ కేక్‌లోని ప్రతిభాగం కూడా మా పదేళ్ల ప్రేమకు నిదర్శనం. మా చిన్నారులు లాన్య, సాషా మా కోసం ప్రత్యేకంగా ఓ గ్రీటింగ్ కార్డు తయారు చేసి ఇచ్చారు. ఎంతో సంతోషంగా అనిపించింది. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా డబ్బు, స్పెషల్ గిఫ్ట్స్ లేకపోయినా ప్రేమాభిమానాలతో సంతోషంగా జీవించవచ్చు. మీరు కూడా కుటుంబసభ్యులతో సంతోషంగా గడపండి’ అని రంభ పేర్కొన్నారు.
పదోసారి సంతోషాలు
Related tags :