పామును చూస్తే ఎవరికైనా ప్రాణభయం. అలాంటిది ఒక్కసారిగా కుప్పలు తెప్పలుగా తాచు పాము పిల్లలు బయటపడి అటూ ఇటూ పరుగులు తీస్తుంటే పైప్రాణాలు పైనే పోయినంత పనవుతుంది. ఇందుకు భిన్నంగా మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గవలపల్లికి చెందిన మహిళ 50 తాచు పాములను కర్రతో కొట్టి చంపేశారు. గవలపల్లిలోని కొంక లచ్చల్ అనే వ్యక్తి భార్య స్వరూపతో కలిసి తన వాకిట్లోని బండ రాళ్లను తొలగిస్తుండగా.. దానికింద నుంచి పదుల సంఖ్యలో పాములు బయటకు వచ్చాయి. స్వరూప వెంటనే ఒక కర్రను తీసుకొని వెంటాడి సర్పాలను చంపేశారు. విషం ఉండే తాచుపాములు కావడంతో ప్రాణభయంతో చంపేశామని.. తల్లి పాము కనిపించలేదని చెప్పారు.
బండ కింద బోలేడు పాములు
Related tags :