NRI-NRT

శశికాంత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కరోనా నిరోధక సామాగ్రి పంపిణీ

Vallepalli Sasikanth Foundation Donates Corona Safety Items To Needy In AP

ప్రవాసాంధ్రుడు, తానా ఫౌండేషన్ కోశాధికారి, హైదరాబాద్ Qhub వ్యవస్థాపకుడు వల్లేపల్లి శశికాంత్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సోమవారం నాడు బెజవాడలో వివిధ వర్గాలవారికి 20వేలకు పైగా కరోనా నిరోధక సామాగ్రిని ఉచితంగా పంపిణీ చేశారు. మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లను పంచారు. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు, న్యాయవాదులకు, వృద్ధులకు, జుడాలకు వీటిని పంపిణీ చేశారు. మిగిలిన వాటిని బలహీన వర్గాల వారికి అందజేయాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేత గొట్టిపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.