దేశ ఆర్ధిక వ్యవస్థ గత మూడేళ్లుగా తీవ్ర స్తబ్దతలోనే ఉందని మరో నివేదిక స్పష్టం చేసింది. భారత్‌లో నెలకొన్న మాంద్యంతో అత్యంత కీలకమైన తొమ్మిది రియాల్టీ మార్కెట్లలో విలాసవంతమైన గహాలకు ఇప్పటికీ డిమాండ్ స్థబ్దుగానే ఉందని ప్రాప్ టైగర్ డాట్ కామ్ నివేదిక ఓ రిపోర్టులో వెల్లడించింది. గత మూడేళ్లలో ప్రారంభించిన ఈ తరహా గహాలలో సగానికి పైగా యూనిట్లు అమ్ముడుకాకుండా ఉన్నాయని తెలిపింది. ఈ రిపోర్టును అహ్మదాబాద్, బెంగళూరు , చెన్నరు, గురుగావ్, హైదరాబాద్, కోల్‌కతా, ముంబయి నగరాలను పరిగణలోకి తీసుకుని రూపొందించింది. హౌసింగ్ డాట్ కామ్, మకాన్ డాట్ కామ్ లాంటి పోర్టల్స్ సహా ఇలారా టెక్నాలజీస్‌లో భాగమైన రియల్ ఎస్టేట్ పోర్టల్ ప్రాప్ టైగర్ గణాంకాల ప్రకారం.. రూ.1-3 కోట్ల మధ్య ధర కలిగిన గృహా యూనిట్ల పరంగా చూస్తే 2018లో 29,996 యూనిట్లు ప్రారంభిస్తే 2019లో వాటి సంఖ్య 29,775 యూనిట్లుగా మాత్రమే ఉంది. 2020 మార్చి నాటికి ఈ విభాగంలో 51,997 యూనిట్లు అమ్ముడు పోకుండా ఉన్నాయి. అదే విధంగా రూ.3-5 కోట్ల విలువ చేసే 4,762 యూనిట్లు, రూ.5-7 కోట్ల విలువ చేసే 2,025 యూనిట్లు, రూ.7 కోట్ల పైబడిన 577 లగ్జరీ గృహాలు విక్రయం కాకుండా ఉండిపోయాయి. రూ.3-5 కోట్ల విభాగంలో 56 శాతం యూనిట్లు అలాగే మిగిలిపోయాయి. రూ.5-7 కోట్ల ధరల యూనిట్లలో 2018లో 1536 యూనిట్లు ప్రారంభిస్తే గత సంవత్సరం కేవలం 858 యూనిట్లు మాత్రమే ఆవిష్కరించారు. గత మూడేళ్ల కాలంలో అందుబాటులోకి తెచ్చిన వీటిలో దాదాపు 55 శాతం యూనిట్లు ఇంకా విక్రయించబడలేదు.
*కరోనాతో మరింత ప్రతికూలత
ప్రస్తుత మందగమనంలో దేశ రియల్ ఎస్టేట్ ఇప్పుడు అసాధారణ ఒత్తిడిని ఎదుర్కొంటుందని హౌసింగ్ డాట్ కామ్, మకాన్ డాట్ కామ్, ప్రాప్ టైగర్ డాట్ కామ్ గ్రూప్ సిఇఒ ధృవ్ అగర్వాల్ పేర్కొన్నారు. కరోనా వైరస్ మహమ్మారి విజంభిస్తుండటంతో 2021 ఆర్థిక సంవత్సరం మొదటి అర్ధ భాగంలో లగ్జరీ హౌసింగ్ సహా రియల్ ఎస్టేట్ రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. నోట్ల రద్దు తరువాత విలాసవంతమైన గహాలకు డిమాండ్ గణనీయంగా పడిపోయిందన్నారు. ఆ తరువాత ధోరణిలో కూడా పెద్దగా మార్పు రాలేదన్నారు.
వ్యతిరేక దిశలో భయంకరమైన వేగంతో పడిపోతున్న రియల్ ఎస్టేట్
Related tags :