Movies

బోడి ఆధిపత్యం చెలాయిస్తే…

Shalini Pandey Speaks Of Her Choices-Telugu Movie News

ఒకే ఒక్క సినిమాతో అందరి చూపు తనవైపు తిప్పుకోగలిగింది షాలినీ పాండే. అవడానికి ఉత్తరాది అమ్మాయే అయినా, దక్షిణాదినే మంచి పేరు తెచ్చుకుని ఆ తరువాత బాలీవుడ్‌లో బిజీ అయింది. ప్రారంభంలో ఆమె కెరీర్‌ నత్తనడక నడిచినా, ఆ తరువాత మాత్రం స్పీడ్ అందుకుంది. ఎంత స్పీడంటే.. బాలీవుడ్‌లో ఒక్క అవకాశమొస్తే చాలని దక్షిణాది హీరోయిన్లు కళ్ళుకాయలు కాచేలా ఎదురుచూస్తుంటే.. షాలినీకి ఒకేసారి రెండు మూడు సినిమాల్లో అవకాశం వరించేంతగా ఆమె స్పీడుంది. అయితే షాలినీ పాండే మన జీవితం మీద ఆదిపత్యం చెలాయించాలని చూసేవారికి దూరంగా ఉండండి అని తెలుపుతుంది. ఆ వివరాలేంటో ఆమె మాటల్లోనే.. ‘‘మన జీవితం మీద వేరొకరు ఆధిపత్యం చెలాయిస్తే భరించడం కష్టం. ఆధిపత్యం చెలాయించడం కూడా రెండు రకాలుగా ఉంటుంది. మనల్ని తక్కువ చేసి, తామే అధికులమనుకుంటూ ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటారు. అలాంటి వారికి అస్సలు అవకాశమివ్వకూడదు. వారికి సాధ్యమైనంత దూరంగా ఉండాలి. వారు మనకు ఎంత కావలసిన వారైనా సరే వారితో సంబంధం తెంచుకోవడమే ఉత్తమం. అలాంటి వారిని ఒక్కక్షణం కూడా భరించలేను. వెంటనే వారిని దూరం పెడతాను. లేదా నేనే దూరంగా వెళ్ళిపోతాను. మరో వర్గం ఉంటుంది. మన మీద విపరీతమైన ప్రేమాభిమానాలుంటాయి. వారిని భరించడం తేలికే. అలాంటివారికి దూరంగా ఉండను..’’ అని షాలినీ పాండే చెప్పుకొచ్చింది.