గ్రృహనిర్భందంలో భర్త నేర్చుకున్న మంచి పాఠాలు :
1)చపాతీలన్నీ గుండ్రంగా నే ఉండాలని రూలేమి లేదు.
2)బియ్యంలో లేక ఉప్మాలో నీళ్లెన్ని పోసేది తినే వారి అద్రృష్టం
3)ఇడ్లీలు మెత్తగా ఉండాలనే రూలేమీ లేదు.
4) దోశెలు కాలితే నళ్లబడటం వాటి జన్యుదోషం
5) హోటల్లో ఫ్రీగా దొరికే సాంబారు ఇంట్లో చేయటం కష్టం
6) కొబ్బరి కోరు తీయటం జిమ్ లో కసరత్తు కంటే కష్టం. ఒక్కోసారి రక్తం కూడా ధారపోయాలి !
7) కొత్తగా చట్నీలు చేయాలంటే చేతులుంటే సరిపోవు , ఆలోచించే బుర్ర , కూసంత కళాపోషణ కావాలి
8) కుక్కర్ ఎన్ని విజిల్స్ వేసిందో గుర్తుంచుకోడానికి , మన బుర్రలో మెమొరీ సరిపోదు.
9)ఇల్లు ఊడ్చేటప్పుడు , ముందుకూ , తుడిచేటప్పుడు , వెనక్కూ నడవాలి
10) గిన్నెలు తోమేటప్పుడు , రెండుసార్లు ప్రదక్షిణాకారంగా , మరో రెండుసార్లు అప్రదక్షిణంగా చేయితిప్పాలి
11) వంటగది అనేది ఒక అద్భుత ప్రపంచం. కానీ ,అందులో వస్తువులు కావాలంటే, గూగుల్ లో వెతకితే దొరకవు.
భర్తలందరూ రావాలి…ఈ వంటింటి పాఠాలు నేర్చుకోవాలి
Related tags :