Politics

ఏ మాధ్యమం అనేది పిల్లల ఇష్టం-హైకోర్టు

AP High Court Cancels Govt GO To Get Into English Medium

ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ఉన్నతన్యాయస్థానం రద్దు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.81,85ను రద్దు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది.ఆంగ్ల మాధ్యమాన్ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోలను సవాల్‌ చేస్తూ భాజపా నాయకుడు సుదీష్‌ రాంబొట్ల, గుంటుపల్లి శ్రీనివాస్‌ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఏ మాధ్యమంలో చదవాలన్న అంశం విద్యార్థుల నిర్ణయానికే వదిలివేయాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాది కోర్టులో వాదించారు. ఆంగ్లమాధ్యమాన్ని తప్పనిసరి చేయడం సరికాదని పేర్కొన్నారు. మరోవైపు ఆంగ్లమాధ్యమం విద్యార్థుల భవిష్యత్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు. ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు తీర్పును రిజర్వ్‌లో ఉంచి ఈరోజు వెలువరించింది. జీవోలను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.